Poonam Pandey: పబ్లిక్ ప్లేస్‌లో అశ్లీల వీడియోలు.. నటిపై ఛార్జ్ షీట్ దాఖలు..

Poonam Pandey: ఒక పార్న్ స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఎనలేని పాపులారిటీని సంపాదించుకుంది పూనమ్ పాండే. పలు సినిమాల్లో, షోలలో కనిపించి మెప్పించి పూనమ్.. కాంట్రవర్సీలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పటికే కాంట్రవర్సీల వల్ల పూనమ్‌పై చాలా నెగిటివిటీ ఏర్పడింది. తాజాగా తను చేసిన ఓ పనికి మరోసారి చిక్కుల్లో పడింది పూనమ్ పాండే.
పూనమ్ పాండే.. నటుడు సామ్ బాంబేను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ 2021 వారిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. సామ్ బాంబే తనను మానసికంగా, శారీరికంగా హింసించాడని పూనమ్ ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉంటుంది. దానివల్లే సామ్ జైలు శిక్షను కూడా అనుభవించాడు. అయితే 2020లో వీరిద్దరు కలిసునప్పుడు తీసుకున్న ఓ వీడియో వీరిద్దరినీ చిక్కుల్లో పడేసింది.
కెనకొనా ప్రాంతంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని చాపోలి డ్యామ్ వద్ద పూనమ్ పాండే అశ్లీల వీడియోలు తీసుకుంది. అంతే కాకుండా అది పబ్లిక్ ప్లేస్ అయినా.. అక్కడ న్యూడ్ ఫోటోషూట్‌లో పాల్గొంది. అందుకే కొందరు పూనమ్‌పై ఫిర్యాదు చేశారు. అశ్లీల వీడియోగ్రాఫీ, అందరు ముందు అభ్యంతరకర నృత్యాలు చేసినందుకు పూనమ్ పాండే, ఆమె మాజీ భర్త సామ్ బాంబేపై ఛార్జ్ షీట్ దాఖలయ్యింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com