Pooja Hegde: పూజా హెగ్డే మరో స్పెషల్ సాంగ్.. ఈసారి బాలీవుడ్‌లో..

Pooja Hegde: పూజా హెగ్డే మరో స్పెషల్ సాంగ్.. ఈసారి బాలీవుడ్‌లో..
Pooja Hegde: పూజా హెగ్డే ఒకవైపు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్‌ను కూడా ఒకే చేస్తోంది.

Pooja Hegde: ఒకప్పటిలాగా స్పెషల్ సాంగ్స్ కోసం ఎక్కడెక్కడి నుండి భామలను దింపడం మానేశారు మేకర్స్. స్టార్ హీరోయిన్స్‌తోనే స్పెషల్ సాంగ్స్ చేయిస్తే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని భావించి.. పారితోషికం ఎక్కువైనా అదే పని చేస్తున్నారు. అయితే వరుసగా స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఒప్పుకుంటున్న వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు.


పూజా హెగ్డే ఒకవైపు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్‌ను కూడా ఒకే చేస్తోంది. హీరోయిన్‌గా తన కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే 'రంగస్థలం'లో జిగేలు రాణిగా మెరిసింది. ఇక గత కొంతకాలంగా పూజా నటిస్తున్న సినిమాలు కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోవడంతో మరోసారి 'ఎఫ్ 3'లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇక తాజాగా ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ మేకర్స్ కూడా పూజాను సంప్రదించినట్టు సమాచారం.


అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా.. రణభీర్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రమే 'యానిమల్'. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిణితీ చోప్రాను అనుకున్నా.. పలు కారణాల వల్ల తను ఈ మూవీ నుండి తప్పుకోవడంతో రష్మికను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. అయితే ఈ సినిమాలో పూజా ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. హిందీలో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా కేవలం స్పెషల్ సాంగ్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి.

Tags

Next Story