Prakash Raj: అందరూ ఉమ్మివేశారు... సిగ్గు లేదా...

విలక్షణ నటుడిగా పేరుగాంచిన ప్రకాశ్ రాజ్ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై మండిపడ్డారు. ఇది ఓ పిచ్చి సినిమా అంటూ దుయ్యబెట్టారు. అంతేకదు వివేక్ అగ్నిహోత్రికి సిగ్గులేదు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కశ్మీరీ ఫైల్స్ ఓ ప్రచార చిత్రమని వ్యాఖ్యానించారు. ఇటీవలే కేరళలో జరిగిన మాతృభూమి అంతర్జాతీయ ఫెస్టివల్ లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ జ్యూరీ సినిమాపై ఉమ్మివేసినా డైరెక్టర్ కు సిగ్గలేదని అన్న రాజ్, డైరెక్టర్ తనకు ఆస్కార్ రాలేదేంటని అడగటం శోచనీయమని అన్నారు. అతడికి కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదని ఎద్దేవా చేసారు. మీడియా సున్నితంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి ఓ ప్రచార చిత్రాన్ని తీసి ప్రజలపై రుద్దడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. ఈ సినిమాపై సుమారు రూ.2000కోట్లు వెచ్చించారని, కానీ, ప్రజలను మోసం చేయలేరని స్పష్టం చేశారు. గతంలో ఇజ్రయెల్ దర్శకుడు నాదవ్ లాపిడ్ కశ్మీరీ ఫైల్స్ చిత్రాన్ని వల్గర్ అని అన్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లోనే అతడి వ్యాఖ్యలపై వివేక్ స్పందించారు. అర్బన్ నక్సలైట్లు, ఇజ్రయెల్ కు చెందిన దర్శకుడు తన సినిమాలో ఒక్క సీన్ అయినా అబద్ధమని నిరూపిస్తే తాను మళ్లీ సినిమాల జోలికి రానని స్పష్టం చేశారు. ఇలాంటి జనాల వల్లే కాశ్మీర్ లో ఏం జరిగిందన్నది బయటకు రాకుండా సమిధై పోయిందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com