రాజమౌళి ఇలా చేస్తాడనుకోలేదు.. దర్శకధీరుడిపై బోనీకపూర్‌ ఆగ్రహం!

రాజమౌళి ఇలా చేస్తాడనుకోలేదు.. దర్శకధీరుడిపై బోనీకపూర్‌ ఆగ్రహం!
గత కొద్ది రోజులుగా షూటింగ్ దశలో ఉన్న సినిమాలకి సంబంధించిన విడుదల తేదిలను దర్శకనిర్మాతలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

గత కొద్ది రోజులుగా షూటింగ్ దశలో ఉన్న సినిమాలకి సంబంధించిన విడుదల తేదిలను దర్శకనిర్మాతలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న త్రిబుల్ ఆర్ చిత్రాన్నీ అక్టోబర్‌ 13న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదలైన రెండు రోజులకి అక్టోబర్‌ 15న అజయ్ దేవగన్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ మైదాన్‌ చిత్రం విడుదల కాబోతుంది.. ఒకనెలలో రెండు రోజుల తేడాతో ఒకే హీరో నటించిన చిత్రాలను విడుదల చేయడం పట్ల నిర్మాత బోని కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

RRRలో అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాను నిర్మాతగా వ్యవహరిస్తోన్న మైదాన్‌ చిత్రంలో అజయ్‌ మెయిన్ రోల్ లో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని గతేడాదిలోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ కరోనా వలన సినిమా షూటింగ్ అగిపోయింది. అయితే సినిమా కోసం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగానే ఖర్చు అయింది. మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టి అక్టోబర్‌ 15న సినిమాని విడుదల చేస్తామని కూడా ప్రకటించాం. అయితే మా సినిమా ప్రకటించిన కొన్ని రోజులకే.. త్రిబుల్ ఆర చిత్రాన్ని అక్టోబర్‌ 13న విడుదల చేస్తున్నట్లు రాజమౌళి టీం తెలిపింది. ఒకే హీరోకు సంబంధించిన రెండు భారీ ప్రాజెక్ట్‌లు కేవలం రెండు రోజుల తేడాతో విడుదల కావడం దురదృష్టకరం. ఇది అనైతికమైన చర్య అని అయన అభిప్రాయపడ్డారు.

అయితే ఇదే విషయం పైన దర్శకుడు రాజమౌళితో మాట్లాడితే.. విడుదల తేదీతో తనకు సంబంధం లేదని.. అది నిర్మాతల ఇష్టప్రకారం జరిగిందని చెప్పినట్టుగా చెప్పారని వెల్లడించారు. అయితే రాజమౌళి మాటల్ని తానూ నమ్మాలనుకోవడం లేదని అన్నారు. ఇక ఇండస్ట్రీలో మంచి పేరున్న రాజమౌళి నుంచి ఇలాంటిది ఊహించలేదని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story