Radhika Apte: 'అదంతా నా వల్ల కాదు'.. హీరోయిన్లపై రాధిక ఆప్టే హాట్ కామెంట్స్..

Radhika Apte: అదంతా నా వల్ల కాదు.. హీరోయిన్లపై రాధిక ఆప్టే హాట్ కామెంట్స్..
Radhika Apte: 'అదంతా నా వల్ల కాదు. దీని గురించి మాట్లాడేవారిని కూడా నేను ఎక్కువగా చూడలేదు.'

Radhika Apte: హీరోయిన్‌గా నటించాలి అంటే యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి అనుకునే దానికంటే ముందే అందంగా ఉండాలి అనుకుంటారు కొందరు. చెక్కినట్టు ముక్కు, గులాబీ లాంటి పెదవులు.. ఇలాంటివి ఉంటేనే ప్రేక్షకులు తమను ఆదరిస్తారని చాలామంది నటీమణులు అపోహ పడుతుంటారు కూడా. అలాంటి వారిపై రాధిక ఆప్టే ఘాటు కామెంట్లే చేసింది.


రాధిక ఆప్టే.. నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా.. హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసుకుంది. క్యారెక్టర్‌లో ప్రాముఖ్యత ఉంటేనే సినిమాను ఒప్పుకునే వారిలో రాధిక కూడా ఒకరు. అయితే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని రాధిక.. హీరోయిన్ల సర్జరీల గురించి హాట్ కామెంట్స్ చేసింది. అవన్నీ అనవసరమని విమర్శించింది.


'చాలామంది, ముఖ్యంగా ఇండస్ట్రీలోని వారు సర్జరీలు చేయించుకొని వారి వయసు కనిపించకుండా పోరాటం చేస్తున్నారు. ముఖాన్ని, శరీరాన్ని మార్చుకోవడానికి నాకు తెలిసిన చాలామంది సహ నటీనటులు సర్జరీలు చేయించుకున్నారు. అదంతా నా వల్ల కాదు. దీని గురించి మాట్లాడేవారిని కూడా నేను ఎక్కువగా చూడలేదు. ఇండస్ట్రీలో శరీరాకృతిని పట్టించుకోవద్దు అంటూనే సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. దాని వల్ల నేను కొంచెం విసిగిపోయాను' అంటూ సర్జరీల గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది రాధిక ఆప్టే.

Tags

Read MoreRead Less
Next Story