Rahul Jain: ప్రముఖ సింగర్‌పై అత్యాచార కేసు.. ఉద్యోగం ఇస్తానని మోసం..

Rahul Jain: సినీ పరిశ్రమలో కూడా వేధింపులు జరుగుతాయని కొన్ని సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ వేధింపులు ఎదుర్కున్నా కూడా అందులో కొంతమంది అమ్మాయిలు మాత్రమే బయటికి వచ్చి ధైర్యంగా వారికి జరిగిన అన్యాయం గురించి బయటపెడతారు. తాజాగా అలా ఓ ప్రముఖ స్టైలిస్ట్.. తనపై ఓ సింగర్ అత్యాచారం చేశాడన్న విషయాన్ని బయటపెట్టడం సంచలనంగా మారింది.
బాలీవుడ్‌లో ఎంతోమంది ప్రైవేట్ సాంగ్ కంపోజర్స్ ఉన్నారు. కేవలం ప్రైవేట్ సాంగ్స్‌తోనే గుర్తింపు తెచ్చుకున్న సింగర్స్ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు రాహుల్ జైన్. తనపై ఇటీవల ఓ స్టైలిస్ట్ అత్యాచార కేసు నమోదు చేసింది. ఓషివారా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడని, తన వర్క్ నచ్చడంతో ఇంటికి ఆహ్వానిస్తే వెళ్లాలని బాధితురాలు చెప్పుకొచ్చింది.
రాహుల్ వ్యక్తిగత స్టైలిస్ట్‌గా నియమిస్తానని మాటివ్వడంతో బాధితురాలు తన ఇంటికి వెళ్లానని తెలిపింది. ఆగస్ట్ 11న రాహుల్ ఇంటికి వెళ్లిన బాధితురాలు అక్కడే అత్యాచారానికి గురైంది. తను వారించడంతో రాహుల్ తనను గాయపరచాడని స్టేట్‌మెంట్‌లో తెలిపింది. బాధితురాలి స్టేట్‌మెంట్‌తో పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ జైన్‌పై గతంలో కూడా పలు అత్యాచార ఆరోపణలు ఉన్నాయని వారు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com