Rajamouli RRR: జక్కన్న జర జాగ్రత్త....

Rajamouli RRR: జక్కన్న జర జాగ్రత్త....
జక్కన్నపై బాలీవుడ్ డైరెక్టర్ ప్రశంసల జల్లు; రాజమౌళిని హాలీవుడ్ ఎత్తుకెళ్లిపోతుందంటూ కితాబు....

భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నడూ లేనంత గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టిన రాజమౌళి... ప్రస్తుతం దేశీయ ఫిల్మ్ మేకర్ల దృష్టిలో ఓ మహాశక్తిగా మారిపోయాడనే చెప్పాలి. ఎవరి నోట విన్నా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ జపం షరామామూలు అయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు జక్కన్నను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సైతం రాజమౌళి కాస్త జాగ్రత్తా... అంటూ వ్యాఖ్యానించాడు.


అదేంటి ప్రశంసలు అంటున్నారు, మరి ఈ మాట కాస్త బెదిరింపును సూచిస్తోందే అనుకుంటున్నారా....! నిజమే ఇదోరకమైన హెచ్చరికే మరి. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి, ఆర్ఆర్ఆర్ గురించి ప్రస్తావన రాగా, జక్కన్నను హాలీవుడ్ ఎత్తుకుపోయే ఛాన్స్ లు ఉన్నాయని అన్నాడు అనురాగ్ కశ్యప్. ఇప్పటివరకూ హాలీవుడ్ లో పాగా వేసేందుకు భారత్ నుంచి ఎందరో ప్రయత్నించారని, కానీ, ఇప్పుడు అది కేవలం జక్కన్నకు మాత్రమే సాధ్యమని కితాబు ఇచ్చాడు. మార్వెల్, డీసీ స్థాయిలో సినిమాలు తెరకెక్కించగల సత్తా జక్కన్నకు ఉందని స్పష్టం చేశాడు. నాటునాటు లాంటి పాట కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమని, మరెవ్వరూ ఆ స్థాయిలో పాటను చిత్రీకరించలేని తెలిపాడు.


కాబట్టి, రాజమౌళిని హాలీవుడ్ కచ్చితంగా ఎత్తుకుపోతుందని భయపడుతున్నాను అంటూ ముగించాడు అనురాగ్ కశ్యప్. మరి దీనిపై మన జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story