Rakhi Sawanth: నెల రోజుల్లోనే.. ప్రేమ... పెళ్లి... పెటాకులు...

X
By - Chitralekha |7 Feb 2023 5:32 PM IST
ఇటీవలే వివాహమాడిన ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్; అంతలోనే భర్తపై ఆరోపణలు; పోలీస్ కంప్లైంట్; వరుడు జైలుకి... కథ కంచికి
ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ నిత్యం వార్తల్లోని వ్యక్తే అనడంలో సందేహమే లేదు. అయితే గత కొంత కాలంగా అమ్మడి వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకుంటోన్న పరిణామాలతో రోజుకు ఒకసారైనా హెడ్ లైన్స్ ఎక్కేస్తోంది. సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ తో పెళ్లి చేసుకుంది మొదలు రాఖీ రభస మొదలైందనే చెప్పాలి. పెళ్లి చేసుకుని పట్టుమని నాలుగు రోజులు అయ్యిందో లేదో అప్పుడే తన భర్తకు వివాహేతర సంభందాలు ఉన్నాయంటూ మీడియా ముందు గగ్గోలు పెట్టింది. ఇక అక్కడి నుంచి కథ మరింత రసవత్తరంగా మారింది. తన వైవాహిక జీవితంలో ఎవరో అమ్మాయి చిచ్చుపెట్టిందని వాపోయిన రాఖీ, మరో రెండు రోజులు గడిచేసరికి తన భర్తే అసలు దోషి అంటూ కొత్త పాట అందుకుంది. తనని వాడుకుని ఆఫర్లు అందిపుచ్చుకోవాలని ప్లాన్ చేశాడంటూ ఆరోపించింది. అంతేకాదు... ఆదిల్ పై ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయని తాజాగా కొత్త వార్త మోసుకొచ్చింది. ఈ మేరుకు పోలీసులుకు కంప్లైంట్ చేశానని చెప్పింది. ఇక అమ్మడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదిల్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం రాఖీ, ఆదిల్ ఓ రెస్టారెంట్ లో కలసి భోంచేయడం కొంత మంది చూశారట. ఇద్దరూ ఒకరికి మరొకరు ప్రేమగా తినిపించుకుంటున్నారని కూడా తెలుస్తోంది. దీంతో ఏది నిజం ఏది అబద్ధం అని జనాలకు అర్థం కాని విషయంగా మారింది. ఏమైనా మన డ్రామా క్వీన్ రాఖీకి ఇలాంటి ఆటలు కొత్తాకాదు... జనాలకు ఈ చోద్యంలో వింతేమీ లేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com