Ram Charan: మహారాజు పాత్రలో రామ్ చరణ్.. ఆ బాలీవుడ్ హీరోను కాదని..

Ram Charan: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. బాలీవుడ్‌లో కూడా ఇప్పుడు రామ్ చరణ్ అంటే తెలియని వారు లేరు. అందుకే ప్రస్తుతం చాలామంది మేకర్స్.. తాము తెరకెక్కించాలనుకునే పాన్ ఇండియా చిత్రాల కోసం తనను హీరోగా ఒప్పించాలని అనుకుంటున్నారు. తాజాగా ఓ ఇండియన్ ఫేమస్ రైటర్ కూడా తాను రాసిన పాత్రకు రామ్ చరణే న్యాయం చేయగలడని నిర్ణయించుకున్నారట.
'మగధీర' అనే సినిమా రామ్ చరణ్ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఇందులో కాలభైరవ పాత్ర ఇప్పటికీ చాలామందికి గుర్తుండిపోయింది అంటే దానికి రాజమౌళితో పాటు చరణ్ యాక్టింగ్ కూడా కారణం. అయితే ఇన్నాళ్ల తర్వాత మరోసారి చరణ్.. రాజుగా కనిపించనున్నాడట. అది కూడా ఓ మహారాజు జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో తాను ఈ పాత్ర పోషించనున్నాడని సమాచారం.
ఫేమస్ ఇండియన్ రైటర్ అమిష్ త్రిపాఠి రాసిన లెజెండ్ ఆఫ్ సుహేల్ దేవ్: ది కింగ్ హూ సేవ్డ్ ఇండియా అనే పుస్తకం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలనుకుంటున్న ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కానీ లాక్‌డౌన్ కారణంగా అన్నింటికి బ్రేక్ పడింది. ఇప్పుడు మరోసారి ఈ కథను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాడు అమిష్ త్రిపాఠి.
ముందుగా ఈ సినిమాకు అక్షయ్ కుమార్‌ను హీరోగా అనుకున్నా కూడా ఇప్పుడు రామ్ చరణ్ అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. దీనికి రామ్ చరణ్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తికి చెందిన మహారాజే సుహేల్ దేవ్. 11వ శతాబ్దంలో భారతదేశంపై టర్కీ చేసిన పలు దాడుల్లో సుహేల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనపై సినిమా తీసి.. ఆయన కథను అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాడు అమిష్ త్రిపాఠి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com