Ramoji Film City: బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి తీవ్రగాయాలు

బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి షూటింగ్ స్పాట్ లో ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్ లో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఒక ఛేజింగ్ సీన్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఆయన అదుపుతప్పి కింద పడటంతో హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు.
ఓ వెబ్ సిరీస్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రోహిత్ శెట్టి ఓ యాక్షన్ సన్నివేశం కోసం పెద్ద ఎత్తున ప్లానింగ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా, అనుకోకుండా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చికిత్స నిమిత్తం రోహిత్ శెట్టిని ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ కి తరలించినట్లు యూనిట్ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం రోహిత్ ఆర్యోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com