Rana: మరో ప్రయోగం చేయనున్న రానా.. ఈసారి బాలీవుడ్‌లో..
Rana: ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో హీరోగా, విలన్‌గా నటించిన రానా.. తాజాగా మరో చిత్రాన్ని సైన్ చేసినట్టు తెలుస్తోంది.

Rana: హీరోలు అనిపించుకోవడం కంటే యాక్టర్స్ అనిపించుకోవడానికే చాలామంది యంగ్ నటులు ఇష్టపడుతున్నారు. అందుకే లీడ్ రోల్ కాకపోయినా.. డిఫరెంట్ కథలలో నటించడానికి ఓకే చెప్తున్నారు. అలాంటి వారిలో ముందుంటాడు రానా. ఇక ప్రయోగాలు చేయను అన్న రానా మరో ప్రయోగానికి సిద్ధమయినట్టు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్‌లో.
'బాహుబలి'కంటే ముందే రానా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అప్పటికే తను హిందీతో పాటు పలు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేశాడు. ఇక బాహుబలితో విలన్‌గా మారిన రానా.. అప్పటినుండి ప్రయోగాల వైపు అడుగేయడం మొదలుపెట్టాడు. ఇప్పటికీ ఎన్నో ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా.. ఇక ప్రయోగాల వైపుకు వెళ్లనని, ఫ్యాన్స్‌కు నచ్చేలా సినిమాలు చేస్తానని తెలిపాడు.
ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో హీరోగా, విలన్‌గా నటించిన రానా.. తాజాగా మరో చిత్రాన్ని సైన్ చేసినట్టు తెలుస్తోంది. తమిళ డైరెక్టర్ అట్లీతో షారుక్ ఖాన్ జవాన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఓ కీలక పాత్ర కోసం రానాను సంప్రదించిందట మూవీ టీమ్. డిఫరెంట్ కథ కాబట్టి రానా కూడా ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అంతే కాకుండా జవాన్‌లో దీపికా పదుకొనె, విజయ్ లాంటి వారు కూడా గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారని సమాచారం.
RELATED STORIES
Maharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMTMaharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన...
29 Jun 2022 2:30 PM GMTPlastic Ban: ప్లాస్టిక్ బ్యాన్.. జులై 1 నుంచి షురూ..
29 Jun 2022 5:48 AM GMTMumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..
28 Jun 2022 4:00 PM GMTUdaipur: నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. నడిరోడ్డుపై తల నరికి హత్య.....
28 Jun 2022 3:45 PM GMTAlt News: ప్రముఖ న్యూస్ ఛానెల్ వ్యవస్థాపకుడు అరెస్ట్.. ఆ సోషల్ మీడియా...
28 Jun 2022 3:30 PM GMT