Ranbir Kapoor: అబ్బే... మనకు సిగ్గు లేదు సుమీ..!

Ranbir Kapoor: అబ్బే... మనకు సిగ్గు లేదు సుమీ..!
కరీనా కపూర్ షోలో రణ్ బీర్ కపూర్ షాకింగ్ స్టేట్మెంట్లు; ఆ విషయంలో తనకు ఆత్మాభిమానం లేదంటూ వ్యాఖ్యలు

ఒకానొక సమయంలో బాలీవుడ్ కాసనోవాగా పేరుగాంచిన రణ్ బీర్ కపూర్ ఆలియా భట్ ను పెళ్లాడి ఓ చిన్నారికి తండ్రి అయ్యాక కాస్త కుదుట పడినట్లుగానే కనిపిస్తున్నాడు. ఇక ఇటీవలే తు జూఠీ మేఁ మక్కర్ సినిమా హిట్ అవ్వడంతో మాంచి ఊపు మీద ఉన్న రణ్ బీర్ తాజాగా కజిన్ సిస్టర్ కరీనా కపూర్ షోలో పాలుపంచుకున్నాడు. బెబో కూడా మిర్చి ప్లస్ కొల్లాబొరేషన్ లో ఇటీవలే ఓ టాక్ షో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి తొలి గెస్ట్ గా హాజరైన రణ్ బీర్ కపూర్ చాలానే విషయాలను పంచుకున్నాడు. అంతేకాదు, తనకు కాస్త ఆత్మాభిమానం తక్కువేనని వెల్లడించాడు. అయితే అన్ని విషయాల్లోనూ కాదు సుమీ! విషయం ఏమిటంటే ఎవరితోనైనా తన అనుబంధం దెబ్బతింటోంది అనుకున్నప్పుడు తానే ముందుగా తన ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి క్షమాపణలు చెబుతానని వెల్లడించాడు. ఆ విషయంలో ఏ మాత్రం మొహమాటపడనని, తనకు తన చుట్టూ ఉన్నవారితో సత్సంబంధాలు ఎందో ముఖ్యమని తెలిపాడు. ఇక కాఫీ విత్ కరణ్ షోపైనా ఘాటు వ్యాఖ్యలే చేశాడు. ఆ షో వల్ల తామిద్దరి పరువు పోయిందని, అతడు తమ గురించి ఏదొకటి వాగుతూనే ఉంటాడని అన్నాడు. ఏమైనా ప్రస్తుతం తండ్రి పాత్రలో ఎంతో ఆనందంగా ఉన్నానని, తన చిన్నారికి డైపర్లు మార్చడం సంతోషంగా ఉందని తెలిపాడు.

Tags

Next Story