Ranbir Kapoor: రణభీర్ ఫేవరెట్ హీరోయిన్ ఆలియా కాదట.. మరి ఎవరంటే..?
Ranbir Kapoor: బాలీవుడ్‌లో ఇటీవల పెళ్లి చేసుకున్న క్యూట్ కపుల్ ఆలియా భట్, రణభీర్ కపూర్. వీరి దాదాపు అయిదు సంవత్సరాల నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా కొన్నాళ్ల క్రితమే దీని గురించి అధికారికంగా బయటపెట్టారు. ఆ తర్వాత మరికొన్నాళ్లకే పెళ్లి కూడా చేసేసుకున్నారు. ఇక త్వరలోనే వీరు తల్లిదండ్రులు కూడా కాబోతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో రణభీర్ తన ఫేవరెట్ హీరోయిన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
రణభీర్ కపూర్ చివరిగా హీరోగా కనిపించిన చిత్రం 'సంజు'. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు నాలుగేళ్లు అవుతుండగా.. ఇన్నాళ్ల తరువాత రణభీర్.. 'షంషేరా', 'బ్రహ్మాస్త్ర' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ తన ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు. ఇక షంషేరా చిత్రం త్వరలోనే విడుదల కానున్న సందర్భంగా మూవీ టీమ్ రణభీర్ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తున్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణభీర్.. తన ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శర్మ అన్న విషయాన్ని బయటపెట్టాడు. రణభీర్, అనుష్క కలిసి మూడు చిత్రాల్లో నటించారు. అయితే అనుష్క తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, ఇద్దరూ ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారని తెలిపాడు రణభీర్. అంతే కాకుండా ఇద్దరూ క్రియేటివిటి విషయంలో ఒకేలా ఆలోచిస్తారని అన్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com