Ranbir Kapoor: తెలుగు సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.. త్వరలోనే..: రణబీర్

Ranbir Kapoor: తెలుగు సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.. త్వరలోనే..: రణబీర్
Ranbir Kapoor: రణబీర్, వాణీ కపూర్ జంటగా కరణ్‌ మల్హోత్రా తెరకెక్కించిన చిత్రం ‘షంషేరా’.

Ranbir Kapoor: ప్రస్తుతం సౌత్ సినిమాలు.. బాలీవుడ్‌ను డామినేట్ చేస్తు్న్నాయన్నది ఓపెన్ సీక్రెట్. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఎలాగైన తమ సినిమా సక్సెస్ అవ్వడం కోసం ప్రమోషన్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టారు. తాజాగా రణబీర్ కపూర్ కూడా తన అప్‌కమింగ్ సినిమాల ప్రమోషన్స్‌కు టాలీవుడ్‌నే టార్గెట్ చేశాడు. ఇటీవల తన మూవీ ప్రెస్ మీట్‌లో తెలుగు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రణబీర్.

రణబీర్ కపూర్.. తెరపై కనిపించి చాలాకాలమే అయ్యింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు ఈ యంగ్ హీరో. ముందుగా రణబీర్, వాణీ కపూర్ జంటగా కరణ్‌ మల్హోత్రా తెరకెక్కించిన చిత్రం 'షంషేరా'. ఈ మూవీ జులై 22న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం షంషేరాను ఎలాగైనా హిట్ చేయాలని వరుస ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు రణబీర్.


ఇటీవల టాలీవుడ్ ప్రెస్ మీట్‌కు హాజరయిన రణబీర్.. షంషేరా గురించి మాట్లాడుతూ ఇలాంటి సినిమా చేయడం తన అదృష్టం అని చెప్పుకొచ్చాడు. దక్షిణాది ప్రేక్షకులు సినిమాలను బాగా ప్రేమిస్తారని ప్రశంసించాడు. అంతే కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమా చేయడం కోసమే తను ఎదురుచూస్తున్నాడని, త్వరలోనే తప్పకుండా చేస్తానని మాటిచ్చాడు రణబీర్ కపూర్.

Tags

Read MoreRead Less
Next Story