Ranbir Kapoor: థియేటర్లలో మెప్పించలేని రణబీర్ సినిమా.. అందుకే అప్పుడే ఓటీటీలోకి..

Ranbir Kapoor: థియేటర్లలో మెప్పించలేని రణబీర్ సినిమా.. అందుకే అప్పుడే ఓటీటీలోకి..
X
Ranbir Kapoor: థియేటర్లలో సక్సెస్ సాధించలేని సినిమాలు.. అనుకున్న సమయంకంటే ముందే ఓటీటీలోకి రావడం ఆనవాయితీగా మారిపోయింది.

Ranbir Kapoor: ప్రస్తుతం బాలీవుడ్ టైమ్ ఏమీ బాలేదు అనడానికి నిదర్శనంగా నెలకొక సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర దెబ్బ తింటోంది. భారీ రేంజ్ ప్రమోషన్స్ కూడా హిందీ సినిమాల మార్కెట్‌ను కాపాడలేకపోతున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ప్రేక్షకులను థియేటర్లలకు రప్పించలేకపోతున్నారు. తాజాగా రణబీర్ సినిమాకు కూడా అదే పరిస్థితి వచ్చింది.

క‌ర‌ణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణబీర్ నటించిన చిత్రమే 'షంషేరా'. ఇందులో రణబీర్‌కు జోడీగా వాణి కపూర్ అలరించింది. హిందీతో పాటు పలు ఇతర సౌత్ భాషల్లో విడుదలయిన షంషేరా ప్రమోషన్స్ కోసం రణబీర్ చాలా కష్టపడ్డాడు. ప్రతీ భాషలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్స్‌‌లో పాల్గొన్నాడు. అయినా కూడా రూ.150 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.10 కోట్ల షేర్‌ను కూడా రాబట్టలేకపోయింది.


థియేటర్లలో సక్సెస్ సాధించలేని భారీ బడ్జెట్ సినిమాలు.. అనుకున్న సమయంకంటే ముందే ఓటీటీలోకి రావడం ఆనవాయితీగా మారిపోయింది. అందుకే షంషేరా ఓటీటీ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. ఆగస్ట్ రెండో వారంలో మూవీని స్ట్రీమ్ చేయాలనే ఆలోచనలో ఉందట. షంషేరా డిసాస్టర్ అవ్వడంతో ప్రస్తుతం రణబీర్ ఆశలన్నీ 'బ్రహ్మస్త్ర'పైనే ఉన్నాయి.

Tags

Next Story