Ranveer Singh: పోలీసులకు రణవీర్ విజ్ఞప్తి.. న్యూడ్ ఫోటోషూట్ కేసులో..

Ranveer Singh: పోలీసులకు రణవీర్ విజ్ఞప్తి.. న్యూడ్ ఫోటోషూట్ కేసులో..
Ranveer Singh: ఒక మ్యాగజిన్ కవర్ పేజీ కోసం రణవీర్ తన ఒంటి మీద దుస్తులు లేకుండా ఫోటోషూట్ చేశాడు.

Ranveer Singh: బాలీవుడ్ హీరోలు అందరిలో రణవీర్ సింగ్ రూటే సెపరేటు. ఎవరు ఎంత నెగిటివిటీ చూపించిన, ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా.. రణవీర్ తనకు నచ్చింది తాను చేసుకుంటూ వెళ్లిపోతూ ఉంటాడు. అలాగే ఎన్నో వెరైటీ ట్రెండ్స్‌కు శ్రీకారం చుట్టిన ఘనత కూడా రణవీర్‌దే. తాజాగా అలాగే రణవీర్ సింగ్ ఓ న్యూడ్ ఫోటోషూట్ ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు. కానీ అదే తనను చిక్కుల్లో పడేసింది.

ఒక మ్యాగజిన్ కవర్ పేజీ కోసం రణవీర్ తన ఒంటి మీద దుస్తులు లేకుండా ఫోటోషూట్ చేశాడు. కొన్ని ఫోటోల్లో లోదుస్తులు మాత్రమే ధరించి కనిపించాడు. ఇటీవల రణవీర్ ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. కొన్ని గంటల్లోనే ఆ పోస్ట్‌కు లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చి పడ్డాయి. దీని వల్ల కొందరు తనను ట్రోల్ చేస్తుండగా.. కొందరు మాత్రం రణవీర్ స్టైలే సెపరేటు అనుకుంటున్నాను. ఎందరో బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తన పోస్ట్‌పై కామెంట్ల వర్షం కురిపించారు.

రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ అభ్యంతరకరంగా ఉందంటూ తనపై కేసు నమోదు చేశారు కొందరు. చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో రణవీర్‌పై కేసు నమోదయ్యింది. దీంతో రణవీర్ విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల తాను రాలేకపోతున్నానని రణవీర్ పోలీసులను విజ్ఞప్తి చేసుకున్నాడు. దీంతో వారు ఓ కొత్త విచారణ తేదీ గురించి ఆరోచిస్తున్నట్టుగా సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story