బాలీవుడ్

Rashmika Mandanna: రష్మికను మేడమ్ అని పిలుస్తున్న ఆ బాలీవుడ్ యంగ్ హీరో..

Rashmika Mandanna: పుష్ప రిలీజ్‌కు ముందే హిందీలో రెండు సినిమాలు సైన్ చేసింది రష్మిక.

Rashmika Mandanna: రష్మికను మేడమ్ అని పిలుస్తున్న ఆ బాలీవుడ్ యంగ్ హీరో..
X

Rashmika Mandanna: పాన్ ఇండియా సినిమాల వల్ల హీరోలకు, డైరెక్టర్లకు మాత్రమే కాదు.. హీరోయిన్లకు కూడా మంచి గుర్తింపు లభిస్తోంది. అందుకే 'పుష్ప' మూవీ వల్ల రష్మిక పాపులారిటీ టాలీవుడ్‌ను దాటి బాలీవుడ్ వరకు వెళ్లిపోయింది. పుష్ప రిలీజ్‌కు ముందే హిందీలో రెండు సినిమాలు సైన్ చేసిన రష్మిక.. రిలీజ్ తర్వాత మరో మూవీని ఒప్పుకుంది. తాజాగా ఓ బాలీవుడ్ యంగ్ హీరో గురించి రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రష్మిక ఇప్పటికే అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'గుడ్‌బై' అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో అమితాబ్ కూతురిగా కనిపించనుంది రష్మిక. అంతే కాకుండా యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో 'మిషన్ మజ్ను' చేస్తోంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇంతలోనే రష్మికకు రణబీర్ సింగ్‌తో నటించే అవకాశం వచ్చింది.

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'యానిమల్' చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల ప్రారంభమయ్యింది. ఈ సినిమాతోనే రణబీర్‌ను మొదటిసారి కలుస్తున్నానని చెప్పింది రష్మిక. అందుకే తనతో నటించడానికి కాస్త ఇబ్బంది పడ్డానంది. రణబీర్ చాలా మంచి వ్యక్తి అయినా మొదటిసారి కలిసినప్పుడు భయమేసిందని చెప్పింది రష్మిక.

కలిసిన కాసేపటికే రణబీర్ తనకు మంచి ఫ్రెండ్స్ అయ్యారని చెప్పింది రష్మిక. అంతే కాకుండా సందీప్, రణబీర్‌, సందీప్‌తో కలిసి పనిచేయడం చాలా నచ్చి్ందని చెప్పింది. అయితే రణబీర్ తనను మేడమ్ అని పిలుస్తున్నాడని, అలా పిలవడం తనకు ఇష్టం లేదని తెలిపింది. అంతే కాకుండా తనను ఇప్పటివరకు ఎలా పిలవలేరు అంటోంది రష్మిక.Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES