RatnaPhatak VS Bhumi : నేటి తారలు పసి పాపల్లాంటోరే... అసిస్టెంట్ లేకపోతే అడుగైనా వేయలేరు...

బాలీవుడ్ సీనియర్ నటీమణి, ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా భార్యామణి రత్నాపాఠక్... నేటి తరం తారలపై చేసిన కామెంట్ వైరల్ గా మారింది. సెట్స్ కు వచ్చే తారలు తమ చుట్టూ సహాయకులతో రావడంపై ఆమె తన భావాలను షేర్ చేసుకున్నారు. ఇప్పటి యువ నటీనటులు కనీసం తమ కాఫీ మగ్ కూడా మోయలేకపోతున్నారని, అందుకు అసిస్టెంట్ ల సహాయం తీసుకుంటున్నారని వాపోయారు. వారు 3 నెలల పసిపాపల మాదిరి వ్యవహరిస్తున్నారని, ప్రతి పనికి ఇంకొకరిపై ఆధారపడుతున్నారని తెలిపారు. ఇక యూనిట్ కు దూరంగా వ్యానిటీ వాన్ లో కూర్చోవడం వల్ల ఎంతో మంది మంచి నటీనటుల కెరీర్ లు అర్థాంతరంగా ముగిసిపోయాయని అన్నారు. అయితే నేటి తరం నటి భూమి రత్నా వ్యాఖ్యలపై స్పందించింది. ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను అంటూనే.. వ్యానిటీ వాన్ ల వల్ల నేటి నటులకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందరూ అర్థం చేసుకోవాలని తెలిపింది. వాటి వల్ల తమకు ఎక్కువ స్వాతంత్రం లభిస్తోందని, చేస్తున్న పనిపై ఏకాగ్రత పెట్టే ఛాన్స్ దొరికిందని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com