బాలీవుడ్‌‌‌లో మరో ఛాన్స్.. రెజీనాకి క్రేజీ ఆఫర్ ఇచ్చిన టాలీవుడ్ ప్లాప్ డైరెక్టర్..!

బాలీవుడ్‌‌‌లో మరో ఛాన్స్.. రెజీనాకి క్రేజీ ఆఫర్ ఇచ్చిన టాలీవుడ్ ప్లాప్ డైరెక్టర్..!
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో చత్రపతి హిందీ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో చత్రపతి హిందీ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రెగ్యులర్ కూడా షూటింగ్ మొదలైంది. రాజమౌళి చేతుల మీదిగా మొదలైన ఈ సినిమాలో సాయిశ్రీనివాస్ సరసన హీరోయిన్ గా రెజీనా కాసాండ్రాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలుగులో శ్రియ చేసిన ఈ పాత్రకి రెజీనా కరెక్ట్ గా సరిపోతుందని దర్శకుడు వివి వినాయక్ ఆమెను ఫిక్స్ చేశారని సమాచారం. కాగా ఇప్పటికే బాలీవుడ్ లో ఓ మూవీ చేసిన రెజీనాకి ఇప్పుడు అక్కడ మరో ఛాన్స్ దక్కింది. ఈ మధ్య తెలుగు సినిమాల్లో అంతగా ఆఫర్లు లేక తమిళ సినిమాల్లో నటిస్తుంది ఈ భామ. ముందుగా ఈ పాత్రకోసం కీయరాను అనుకున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. ఫైనల్ గా రెజీనా తీసుకున్నారట. కాగా తనిష్క్‌ బగ్చి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ధవల్‌ జయంతిలాల్‌ గడ, అక్షయ్‌ జయంతిలాల్‌ గడ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story