Rhea Chakraborty: సుశాంత్ సోదరి వ్యాఖ్యలపై రియా చక్రవర్తి ఇన్‌డైరెక్ట్ కౌంటర్..

Rhea Chakraborty: బాలీవుడ్‌లో నెపోటిజంను అతిపెద్ద కాంట్రవర్సీ స్టేట్‌మెంట్‌గా మార్చింది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం. తన ఆత్మహత్యతో బాలీవుడ్‌లోని డ్రగ్స్ కుంభకోణం కూడా బయటపడింది. అంతే కాకుండా సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియాపై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఎన్సీబీ కూడా రియా డ్రగ్స్ తెచ్చి సుశాంత్‌కు ఇచ్చేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో మరోసారి బాలీవుడ్‌లో రచ్చ మొదలయింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంక సింగ్.. ఇప్పటివరకు పలు సందర్భాల్లో రియాపై విరుచుకుపడింది. ఇక ఎన్సీబీ స్టేట్‌మెంట్ తర్వాత మరోసారి రియాపై ఫైర్ అయ్యింది ప్రియాంక. 2019లో రియా తన అన్న జీవితంలోకి వచ్చినప్పుడే వారి జీవితాలు నాశనమయిపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది ప్రియాంక. సుశాంత్‌కు క్లాబ్‌లు, పార్టీలు అలవాటు లేదని, అందుకే బాలీవుడ్‌లోని పెద్దలు రియాను నియమించి సుశాంత్‌ను అలా తయారు చేశారని తెలిపింది.
ప్రియాంక సింగ్ వ్యాఖ్యలపై రియా.. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. 'శబ్దానికి, ఈగోకు అతీతంగా ఎదగాలి. వాళ్లు నీ వైపు వేళేత్తి చూపేలా ఎదగాలి. ఎందుకంటే వారు ఉండలేని స్థానానికి నువ్వు చేరుకున్నావు కాబట్టి. నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. ప్రేమతో ఎగురుతున్నావు. ఏ కారణం లేకపోయినా నువ్వు వారిపై జాలి చూపించాలి. నిన్ను చూసి వారు ఆశ్చర్యపోవాలి. నువ్వు ఎలా ఉన్నావో అలాగే బాగున్నావు. ఒకవేళ అలా కాదని వారు చెప్పినా వినకు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది రియా చక్రవర్తి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com