Rhea Chakravarthy: రోడీస్ లో రియా; కౌంటర్ ఇచ్చిన సుశాంత్ సోదరి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం రియా చక్రవర్తి తొలిసారి రోడీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేను రాను అనుకున్నారా; భయపడ్డాననుకున్నారా అంటూ రోడీస్ ప్రోమోలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. నిజానికి రియా సినీ కెరీర్ కూడా రోడీస్ కార్యక్రమంతోనే మొదలైంది. తాజాగా సీజన్ కు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతోంది. సుశాంత్ మరణాంతరం ఆమె తొలి ప్రాజెక్ట్ ఇదేనని చెప్పాలి. ఇదిలా ఉంటే రియా రీ-ఎంట్రీపై నెటిజెన్లలో డివైడ్ టాక్ నెలకొంది. కొందరు ఆమె రాకపై హర్షం వ్యక్తం చేస్తోంటే, సుశాంత్ విషయంలో ఆమెనే దోషిగా భావిస్తున్నవారు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కోవలోనే సుశాంత్ సోదరి ప్రియాంక సైతం రియా రోడీస్ ఎంట్రీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నువ్వెందుకు భయపడతావు, ఎప్పుడైనా నువ్వు వేశ్వవేనంటూ తీవ్రంగా విమర్శించింది. నీ కస్టమర్లు ఎవరన్నదే అసలైన ప్రశ్న అంటూ ట్వీట్ చేసింది. కేవలం నాయకుడు మాత్రమే ఆమెకు సహాయం చేయగలడని ఎద్దేవా చేసింది. మరి దీనికి రియా ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com