సుశాంత్‌ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేసిన రియా చక్రవర్తి

సుశాంత్‌ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేసిన రియా చక్రవర్తి
రియా చక్రవర్తి సుశాంత్‌ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్‌ కోసం సుశాంత్ తనకు సన్నిహితంగా ఉన్నవారిపై ఆధారపడేవాడని ఆమె వెల్లడించింది..

రియా చక్రవర్తి సుశాంత్‌ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్‌ కోసం సుశాంత్ తనకు సన్నిహితంగా ఉన్నవారిపై ఆధారపడేవాడని ఆమె వెల్లడించింది. డ్రగ్స్‌, ఈడీ, సీబీఐ కేసుల్లో రెండు వారాల క్రితం అరెస్టైన రియా ప్రస్తుతం జైల్లో ఉంది. సుశాంత్‌తో సహజీవనం చేసిన రియానే సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ దరఖాస్తులపై బాంబే హైకోర్టు రేపు విచారించనుంది. ఇవాళే విచారణకు రానుండగా ముంబైలో భారీ వర్షం కారణంగా విచారణ వాయిదా పడింది. బెయిల్ కోసం రియా, ఆమె సోదరుడు పిటిషన్ పెట్టడం ఇది రెండోసారి. మొదటిసారి పెట్టిన బెయిల్ దరఖాస్తులను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో మరోసారి వీరిద్దరూ బెయిల్‌ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

Tags

Read MoreRead Less
Next Story