బాలీవుడ్

Salman Khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు లేఖ.. చంపేస్తామంటూ వార్నింగ్..

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ను, తన తండ్రిని చంపేస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి.

Salman Khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు లేఖ.. చంపేస్తామంటూ వార్నింగ్..
X

Salman Khan: ఒక్కొక్కసారి సినీ సెలబ్రిటీలు కూడా బెదిరింపులకు గురవుతూ ఉంటారు. వారు చేసింది నచ్చినప్పుడు ప్రజలు ఎలాగైతే అభిమానిస్తారో.. నచ్చనప్పుడు కొందరు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటారు. అలాగే ఇటీవల బాలీవుడ్ సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉన్నట్టు బాలీవుడ్ మీడియా వార్తలను ప్రచారం చేస్తోంది. ఇక ఈ వార్తలు నిజమే అన్నట్టుగా ఇటీవల సల్మాన్‌కు ఓ బెదిరింపు లేఖ వచ్చింది.

పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఒక సింగర్‌ను అంత దారుణంగా హత్య చేయడమేంటి అని ఎంతోమంది ఆశ్చర్యపోయారు. అయితే సిద్ధూ తర్వాత హంతకులు సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేశారని, అందుకే తను సెక్యూరిటీ కూడా పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే సల్మాన్‌ను, తన తండ్రిని చంపేస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి.

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. తామే సిద్ధూను హత్య చేసినట్టుగా ప్రకటించింది. దీంతో పోలీసులు లారెన్స్‌ బిష్ణోయ్‌‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అయితే సల్మాన్ ఖాన్‌కు అదే గ్యాంగ్ లేఖ పంపి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఆ కోణంలోనే వారు ఆరా తీయడం కూడా మొదలుపెట్టారు. అయితే ఈ విషయంపై సల్మాన్ ఖాన్ ఇంతవరకు ఏ విధంగా స్పందించలేదు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES