Salman Shah Rukh: సల్మాన్, షారుక్ మల్టీ స్టారర్.. సెట్ చేసిన సౌత్ డైరెక్టర్..

Salman Shah Rukh: సల్మాన్, షారుక్ మల్టీ స్టారర్.. సెట్ చేసిన సౌత్ డైరెక్టర్..
X
Salman Shah Rukh: సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కలిసి కనిపించారు.

Salman Shah Rukh: బాలీవుడ్‌లో హీరోలు మల్టీ స్టారర్ చేయడం చాలా కామన్. కానీ కొన్నాళ్లుగా బాలీవుడ్ ఫేట్ ఏమీ బాలేదు. మల్టీ స్టారర్, మైథలాజికల్ సినిమా చేసినా అవి ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అందుకే బాలీవుడ్ ఖాన్స్ ఇద్దరూ.. ఓ సౌత్ డైరెక్టర్ చెప్పిన మల్టీ స్టారర్ కథకు ఓకే చెప్పినట్టు సమాచారం.

సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కలిసి కనిపించారు. సల్మాన్ హీరోగా చేసిన సినిమాల్లో షారుక్ గెస్ట్ రోల్స్ చేసిన సందర్భాలతో పాటు షారుక్ హీరోగా నటించిన సినిమాల్లో సల్మాన్ గెస్ట్ రోల్స్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. వీరిద్దరూ చివరిగా షారుక్ హీరోగా వచ్చిన 'జీరో'లో కలిసి కనిపించారు. ఇక చాలాకాలం తర్వాత సల్మాన్, షారుక్ ఓ ఫుల్ లెన్త్ మల్టీ స్టారర్ చేయనున్నట్టు సమాచారం.

తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్.. గత రెండేళ్లుగా సైలెంట్‌గా ఉన్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించిన ఈయన.. గట్టి కమ్ బ్యాక్ ఇవ్వడం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సల్మాన్, షారుక్ కోసం ఓ మల్టీ స్టారర్ కథను సిద్ధం చేశాడట మురుగదాస్. అంతే కాకుండా ఈ ఇద్దరికీ కథ బాగా నచ్చడంతో ఓకే కూడా చెప్పేసినట్టు సమాచారం.

Tags

Next Story