Salman Khan: బాలీవుడ్ బ్యూటీతో సల్మాన్ ఖాన్ పెళ్లి..? ఫోటో వైరల్..

Salman Khan: బాలీవుడ్ బ్యూటీతో సల్మాన్ ఖాన్ పెళ్లి..? ఫోటో వైరల్..
Salman Khan: సల్మాన్ ఖాన్.. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడు.

Salman Khan: బాలీవుడ్‌లో ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా వెలిగిపోతున్నాడు సల్మాన్ ఖాన్. 56 ఏళ్లు వచ్చినా.. ఇంకా ఈ సీనియర్ హీరో.. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో, అంతులేని క్రేజ్‌తో బాలీవుడ్‌ను ఏలేస్తున్నాడు. అయితే ఇప్పటికే సల్మా్న్ ఖాన్ పెళ్లిపై ఎన్నోసార్లు, ఎన్నో విధాలుగా రూమర్స్ వచ్చాయి. తాజాగా మరోసారి సల్లూ భాయ్ పెళ్లి వార్త వైరల్‌గా మారింది.

సల్మాన్ ఖాన్.. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. అంతే కాకుండా వారిలో చాలామంది హీరోయిన్లు ఇప్పుడు పెళ్లి చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు. సల్మాన్‌తో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది హీరోలు కూడా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. తాజాగా సల్మాన్ కూడా ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్నాడంటూ ఓ ఫోటో బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.


సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా మంచి స్నేహితులు. సల్మాన్ హీరోగా వచ్చిన 'దబాంగ్'తోనే సోనాక్షి హీరోయిన్‌గా బాలీవుడ్‌కు పరిచమయ్యింది. అప్పటినుండి వీరు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు. అయితే వీరిద్దరికి పెళ్లి అయిపోయిందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది ఎడిట్ చేసిన ఫోటో అని తెలుసుకున్న నెటిజన్లు ఇది నిజమయితే బాగుండేది అనుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story