Salman Khan: రెమ్యునరేషన్ రూ.1000 కోట్లు.. షో కోసం సల్మాన్ ఖాన్ డిమాండ్..

Salman Khan: హీరో అయినా.. హీరోయిన్ అయినా.. క్రేజ్‌ను బట్టి రెమ్యునరేషన్ ఉంటుంది. ముఖ్యంగా వరుస హిట్లతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోలు రెమ్యునరేషన్ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు హీరోలు ఒక్క సినిమాకు రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుండగా.. బాలీవుడ్ ఖండల వీరుడు సల్మాన్ 100 దాటి రూ.1000 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసి అందరికీ షాకిస్తున్నాడు.
బాలీవుడ్ సీనియర్ హీరోల్లో సల్మాన్ ఖాన్ క్రేజే వేరు. అందుకే ఇప్పటికీ సల్మాన్ సినిమాలకు ఫస్ట్ డే హౌస్‌ఫుల్ అవ్వాల్సిందే. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా సల్మాన్ హవా మామూలుగా ఉండదు. అవార్డ్ ఫంక్షన్స్‌ను సల్మాన్ హోస్ట్ చేస్తున్నాడంటే ఆ సందడే వేరు. అందుకే బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ కూడా 13 ఏళ్లుగా సల్మాన్నే హోస్ట్‌గా ఎంపిక చేసుకుంటుంది.
బిగ్ బాస్ హిందీ ఇప్పటివరకు 16 సీజన్లను పూర్తి చేసుకుంది. షో మొదలయిన కొత్తలో అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్‌గా వ్యవహరించారు. కానీ మూడు సీజన్ల తర్వాత సల్మాన్ ఖాన్ దీనిని హోస్ట్ చేయడం ప్రారంభించాడు. సల్మాన్ ఆధ్వర్యంలో ఇప్పటికి 13 సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్.
బిగ్ బాస్ 16వ సీజన్‌ను హోస్ట్ చేయడానికి సల్మాన్ రూ.1050 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. అంతే కాకుండా రెమ్యునరేషన్ అందకపోతే హోస్టింగ్ చేయనంటూ కండీషన్ కూడా పెట్టాడట. బిగ్ బాస్ 15వ సీజన్ కోసం సల్మాన్ రూ.350 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com