Samantha: 'ఊ అంటావా' పాటపై సల్మాన్ కామెంట్స్.. సమంత రియాక్షన్..

Samantha: సౌత్‌తో పాటు నార్త్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సమంత.. ఇటీవల ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది. ఇన్నాళ్లు తాను ఎన్ని సినిమాలు చేసినా రాని మాస్ రేంజ్ ఇమేజ్‌ను 'పుష్ప'లోని ఊ అంటావా మావా.. ఊఊ అంటావా పాటతో కొట్టేసింది. ఈ పాట కేవలం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఈ పాటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సమంత.. ఇప్పటివరకు ఒక్క హిందీ చిత్రంలో నటించకుండగానే బాలీవుడ్‌లో గుర్తింపు సంపాదించింది. దీనికి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, పుష్పలో ఊ అంటావా పాటే కారణం. ఈ రెండు విషయాలు సమంతను బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర చేశాయి. అందుకే సల్మాన్ కూడా తన తరువాతి సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే తను సమంత పాటపై కామెంట్స్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సల్మాన్.. తనను ఈ ఏడాదిలో బాగా ఇన్‌స్పైర్ చేసిన పాట ఏది అని అడగగా.. సల్మాన్ వెంటనే ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ అని పాడేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సమంత వరకు చేరింది. దీనిని సమంత రీ ట్వీట్ చేస్తూ హార్ట్ సింబల్స్‌తో సమాధానం ఇచ్చింది.
♥️♥️♥️ https://t.co/UzkF0PVspl
— Samantha (@Samanthaprabhu2) June 26, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com