Salman Khan lawyer : సల్మాన్ ఖాన్ లాయర్‌ను చంపుతామని బెదిరింపులు..

Salman Khan lawyer : సల్మాన్ ఖాన్ లాయర్‌ను చంపుతామని బెదిరింపులు..
Salman Khan lawyer : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ లాయర్ ను చంపుతామని బెదిరింపులు వచ్చాయి.

Salman Khan lawyer : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ లాయర్ హస్తిమల్ సరస్వత్ కు సింగర్ మూసేవాల హంతకుల నుంచి చంపుతామని బెదిరింపులు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ప్రముఖ పంజాబీ సింగర్ సిద్దు మూసేవాలాను గ్యాంగ్స్‌టర్ లారెన్స్ బిష్నాయ్ హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత సల్మాన్ ఖాన్ ను చంపుతామని లేఖను విడుదల చేశారు.

తాజాగా సల్మాన్ ఖాన్ హిట్ ఆండ్ రన్ కేసును హ్యాండిల్ చేస్తున్న లాయర్ హస్తిమల్ సరస్వత్ కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. శత్రువుకి మిత్రుడు కూడా మాకు శత్రువే , నీతోపాటు నీ కుటుంబాన్ని మొత్తం మూసేవాలాను చంపినట్లు చంపుతామని రాసిన లేఖ లాయర్ ఇంటి బయట వదిలి వెళ్లారు.

లేఖను చదవగానే.. వెంటనే లాయర్ హసిమల్ మహామందిర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి లాయర్ కు ఓ గన్‌మెన్ ను కేటాయించారు. సల్మాన్ ఖాన్ నాకు స్నేహితుడు కాడని కేవలం క్లయింట్ మాత్రమేనని లాయర్ హస్తిమల్ ఈ సందర్భంగా హంతకులకు మీడీయా ద్వారా తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story