Salman Khan : బిగ్‌బాస్ వెయ్యి కోట్ల రెమ్యునరేషన్‌పై సల్మాన్ ఖాన్ ఏమన్నారంటే..?

Salman Khan : బాలీవుడ్ మెగా స్టార్ సల్మాన్ ఖాన్ తన రెమ్యునరేషన్ పై వస్తున్న వార్తల గురించి ఆసక్తికరమైన విషయాలు వెళ్లడించారు. తనకు వెయ్యి కోట్ల రెమ్యునరేషన్ వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. నిజంగా అంత మొత్తం వస్తే తానింక పినచేయాల్సిన అవసరం లేదన్నారు. వెయ్యికోట్లలో నా ఏడాది సంపాదని నాలుగోవంతు కూడా ఉండదన్నారు.
కానీ నిజంగా వెయ్యి కోట్లు వస్తే ఆ రెమ్యునరేషన్‌ను అంగీకరిస్తానన్నారు. న్యాయవాదుల, ఇతర వాటికి ఎక్కువ ఖర్చువుతుందన్నారు. బిగ్‌బాస్ షోపై అనేక పుకార్లు వస్తుంటాయి. నేను ఇవన్నీ విని చాలా అలసిపోయాను. అనేక సార్లు తాను బిగ్‌బాస్ ఇక చేయనని చెప్పినా మేకర్స్ మళ్లీ సంప్రదిస్తున్నారన్నారు. బిగ్‌బాస్ షో జరుగుతున్నప్పుడు తనపై అనేక విమర్శలు వచ్చినా అవి తనను ఏమీ చేయలేవన్నారు సల్మాన్ ఖాన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com