రేపు నా ఇంటికి ఎవరూ రావద్దు: సల్మాన్‌ ఖాన్ విజ్ఞప్తి!

రేపు నా ఇంటికి ఎవరూ రావద్దు: సల్మాన్‌ ఖాన్ విజ్ఞప్తి!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ రేపు 55 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఎప్పటిలాగే సల్మాన్‌ పుట్టిన రోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఈ సారి కూడా అభిమానులు రెడీ అయిపోయారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)రేపు 55 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఎప్పటిలాగే సల్మాన్‌ పుట్టిన రోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఈ సారి కూడా అభిమానులు రెడీ అయిపోయారు. అయితే ఈసారి మాత్రం అభిమానులకు నిరాశ తప్పలేదు. కరోనా నేపధ్యంలో అభిమానులెవ్వరు కూడా రేపు తన ఇంటికి రావొద్దని తెలిపారు సల్మాన్.. ఈ మేరకు ముంబైలో తను నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ ముందు గేటుకు ఓ నోటీసు అంటించారు.

"ప్రతి ఏటా నా పుట్టిన రోజు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తారు.. ఆ రోజున నాపై ఎంతగానో ప్రేమాభిమానాలు కురిపించేవారు. కానీ ఈసారి కరోనా మహమ్మారి దృష్టిలో ఉంచుకుని ఎవరూ కూడా నా ఇంటి ముందు గుమిగూడొద్దని కోరుతున్నాను. మీరందరూ మాస్కు పెట్టుకోండి, సానిటైజర్‌ రాసుకోండి, భౌతిక దూరం తప్పకుండా పాటించండి.. నేను అపార్ట్‌మెంట్‌లో కూడా లేను " అని ఆ నోటిసులో సల్మాన్ రాసుకొచ్చారు.


సాధారణంగా తన ప్రతి పుట్టినరోజును తన ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన సన్నిహితులతో కలిసి జరుపుకుంటారు సల్మాన్‌ . అయితే, ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా గ్రాండ్ గా చేసుకోలేకపోతున్నారు. అటు సల్మాన్‌ ఖాన్ సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం సల్మాన్‌ .. 'అంతిమ్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు. మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ సిక్కు పోలీస్‌ అధికారిగా కనిపిస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story