Samantha: 'కాఫీ విత్ కరణ్' నుండి సమంత ప్రోమో రిలీజ్.. పెళ్లి గురించి ఏం చెప్పిందంటే..

Samantha: కాఫీ విత్ కరణ్ నుండి సమంత ప్రోమో రిలీజ్.. పెళ్లి గురించి ఏం చెప్పిందంటే..
Samantha: కాఫీ విత్ కరణ్ 7వ సీజన్‌లో నాల్గవ ఎపిసోడ్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి పాల్గొంది సమంత.

Samantha: ఇటీవల సౌత్ హీరోయిన్స్‌లో సెన్సేషన్ అయిపోయింది సమంత. ప్రస్తుతం ఈ హీరోయిన్ ప్రొఫెషనల్ లైఫ్ గురించే కాదు పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా విడాకుల తర్వాత సమంత చాలా బిజీ అయిపోయింది. ఓవైపు సినిమాలతో, మరోవైపు యాడ్స్‌తో బిజీ అయిన సామ్.. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకు గెస్ట్‌గా హాజరయ్యింది.


కాఫీ విత్ కరణ్ షో బాలీవుడ్‌లో ఎనలేని పాపులారిటీని సంపాదించుకుంది. ఓవైపు డైరెక్టర్‌గా, మరోవైపు నిర్మాతగా ఎల్లప్పుడూ బిజీగా ఉండే కరణ్ జోహార్.. ఈ షోతో ఓ కొత్త సెన్సేషన్‌కు తెరలేపాడు. ఇందులో పాల్గొనే సెలబ్రిటీలు మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి కాంట్రవర్సీని క్రియేట్ చేస్తాయి. అదే ఈ షోకు పెద్ద ప్లస్‌గా మారింది. అయితే కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో ఈసారి సమంత కూడా పాల్గొనడం విశేషం.

కాఫీ విత్ కరణ్ 7వ సీజన్‌లో నాల్గవ ఎపిసోడ్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి పాల్గొంది సమంత. ఇటీవల ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలయ్యింది. అక్షయ్ కుమార్.. సమంతను చేతులపై మోసుకొని రావడం ఎపిసోడ్‌కే హైలెట్‌గా నిలిచింది.

సమంత పెళ్లి గురించి మాట్లాడాలనుకున్న కరణ్‌ను.. సమంత మధ్యలోనే ఆపేసి కరణే అన్‌హ్యాపీ మ్యారేజెస్‌కు కారణం అని సీరియస్‌గా చెప్పేసింది. ఇక తన ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీని నిర్వహిస్తే.. ఏ ఇద్దరు హీరోలను డ్యాన్స్ చేయడానికి పెడతావు అంటే రెండుసార్లు రణవీర్ సింగ్ పేరే చెప్పింది. అంతే కాకుండా సమంత, అక్షయ్ కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లతో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయినట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది.


Tags

Next Story