Samantha: సమంతకు మరో ఐటెం సాంగ్ ఆఫర్.. ఈసారి బాలీవుడ్‌లో..

Samantha: ఒకప్పుడు ఐటెమ్ సాంగ్స్ చేయడానికి కొత్తవారిని దింపేవారు మేకర్స్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హీరోయిన్స్‌తోనే.. అది కూడా స్టార్ హీరోయిన్స్‌తోనే ఐటెమ్ సాంగ్స్ చేయించడానికి దర్శక నిర్మాతలు ఇష్టపడుతున్నారు. దానికి కొందరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తున్నారు. ఇక ఈ కేటగిరిలో సమంత క్రేజ్‌ను ఇంకెవరూ అందుకోలేకపోతున్నారు. అందుకే సామ్‌కు బాలీవుడ్ నుండి కూడా ఐటెమ్ సాంగ్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' సినిమాకు సమంత చేసిన ఊ అంటావా పాట పెద్ద ప్లస్ అయ్యిందంటే అతిశయోక్తి లేదు. ఈ పాటలో ముందెన్నడూ చూడని సమంతను చూశారు ప్రేక్షకులు. దీంతో ఒక్కసారిగా సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. కాకపోతే ఈ పాట చేయడానికి ముందు సమంత ఇష్టపడలేదట. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి తనను ఒప్పించారని మూవీ టీమ్ ఇదివరకే చెప్పింది.
ఊ అంటావా తర్వాత సమంతకు ఐటెమ్ సాంగ్ ఆఫర్లు చాలానే వస్తాయని ప్రేక్షకులు ఊహించారు. వారు ఊహించినట్టే.. సమంతకు బాలీవుడ్ నుండి ఓ ఆఫర్ వచ్చిందట. రణబీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'యానిమల్' చిత్రంలో సమంత ఓ ఐటెమ్ సాంగ్ చేస్తే బాగుంటుందని, మూవీకి ప్లస్ అవుతుందని టీమ్ అనుకుంటుందట. మరి ఈ ఆఫర్‌కు సమంత ఎస్ చెప్తుందో లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com