బాలీవుడ్

Samantha: కరణ్ జోహార్ నిర్మాణంలో సమంత సినిమా.. హీరో ఎవరంటే..?

Samantha: సమంత.. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Samantha: కరణ్ జోహార్ నిర్మాణంలో సమంత సినిమా.. హీరో ఎవరంటే..?
X

Samantha: సౌత్ సెన్సేషన్ సమంతకు ప్రస్తుతం బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు అందుతున్నాయి. ఇప్పటివరకు బాలీవుడ్ నుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసిన సామ్.. ఇప్పుడు అక్కడ కూడా తన సత్తా చాటాలని అనుకుంటోంది. అందుకే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇచ్చిన ఆఫర్‌కు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సమంత బాలీవుడ్ ఎంట్రీపై ఎన్నో కథనాలు వినిపిస్తుండగా ఈసారి మాత్రం ఇదే ఫైనల్ అని వార్తలు వస్తున్నాయి.

సమంత.. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక త్వరలోనే ఓ సినిమాతో బాలీవుడ్ వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సల్మా్న్ హీరోగా నటిస్తున్న సినిమాలో సమంత కూడా ఓ హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఎంతవరకు నిజముందో తెలియలేదు.

ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ అయిన ధర్మా ప్రొడక్షన్స్‌తో సమంత ఓ సినిమా సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో తాను అక్షయ్ కుమార్ సరసన నటించనుందట. ఇటీవల ప్రారంభమయిన కాఫీ విత్ కరణ్ 7వ సీజన్‌కు హాజరయిన సమంత.. అక్షయ్ కుమార్‌తో కలిసి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఈ వార్తలు నిజమేనేమో అనిపిస్తోంది. ప్రస్తుతం లండన్ టూర్‌లో ఉన్న కరణ్.. తిరిగొచ్చిన తర్వాత ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించనున్నాడని టాక్.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES