Samantha: బాలీవుడ్‌లో సామ్ ఎంట్రీపై ఆసక్తికర కథనాలు.. ఇంతకీ అందులో ఏది నిజం..?

Samantha: బాలీవుడ్‌లో సామ్ ఎంట్రీపై ఆసక్తికర కథనాలు.. ఇంతకీ అందులో ఏది నిజం..?
Samantha: ఇప్పటికే సమంత.. బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించనుందని వార్తలు వచ్చాయి.

Samantha: ఒక్క సినిమాలో కూడా నటించక ముందే సమంత బాలీవుడ్‌లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌లో రాజీ పాత్రే దీనికి కారణం. కెరీర్‌లో మొదటిసారి డీ గ్లామర్ పాత్రలో నటించడమే కాకుండా విలన్‌గా కూడా కనిపించి అందరినీ మెప్పించింది సామ్. దీంతో సామ్ ఎప్పుడెప్పుడు బాలీవుడ్ వెండితెరపై కనిపిస్తుందా అని తన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే దీనికి సంబంధించి ఎన్నో ఆసక్తికర కథనాలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే సమంత.. బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించనుందని వార్తలు వచ్చాయి. ఇందులో తనతో పాటు ఇంకా చాలామంది హీరోయిన్లు కూడా ఉండనున్నారని కూడా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇంతలో కరణ్ జోహార్ నిర్మాణంలో అక్షయ్ కుమార్ సినిమాలో సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని కూడా ప్రచారం సాగింది. కానీ అవేవి కాకుండా మరో కొత్త వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సరసన సామ్ బాలీవుడ్‌లో అడుగుపెట్టనుందట. ఇప్పటికే ఈ మూవీ కోసం తను తన డేట్స్ కూడా ఇచ్చేసినట్టు సమాచారం. మరి ఈ రూమర్ అయినా నిజమా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి'తో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'యశోద' షూటింగ్స్‌లో బిజీగా ఉంది.



Tags

Read MoreRead Less
Next Story