Samantha: బాలీవుడ్ వెండితెరపై సమంత డెబ్యూ.. స్టార్ హీరో సినిమాలో..

Samantha: సమంత రుత్ ప్రభు.. ప్రస్తుతం సినీ పరిశ్రమలో తను ఒక సెన్సేషన్. తనపై ఎంత నెగిటివిటీ చూపిస్తు్న్నా.. తన పని తాను చేసుకుంటూపోతోంది సమంత. అంతే కాకుండా ఓవైపు సినిమాలు, మరోవైపు బ్రాండ్ ప్రమోషన్లు.. ఇలా రెండు చేతులా సంపాదిస్తూ ముందుకెళ్తోంది. ఇక తాజాగా సమంత.. బాలీవుడ్ వెండితెరపై అడుగుపెట్టడానికి రెడీ అవుతోందన్న వార్త వైరల్‌గా మారింది.
సౌత్‌లో ప్రస్తుతం సమంత క్రేజ్ మామూలుగా లేదు. సమంత తమ సినిమాలో నటిస్తే చాలు.. ఆటోమేటిక్‌గా మూవీకి హైప్ వస్తుంది అనుకునే మేకర్స్ ఎంతోమంది ఉన్నారు. అందుకే తనకు కథలు వినిపించడానికి దర్శకులు క్యూ కడుతున్నారు. ఇక సౌత్‌లోనే కాదు నార్త్‌లో కూడా సామ్ క్రేజ్ భీభత్సంగా పెరిగిపోయింది. అందుకే ఓ స్టార్ హీరో సినిమా ఆఫర్ సమంతను వెతుక్కుంటూ వచ్చింది.
సమంత ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అందులో సామ్ చేసిన రాజీ అనే విలన్ పాత్ర ఓ సెన్సేషన్‌ను సృష్టించింది. ఇక ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో మరో సిరీస్ చేస్తోంది. ఇంతలోనే తనకు వెండితెరపై ఛాన్స్ వచ్చిందనే వార్త వైరల్‌గా మారింది. అది కూడా బాలీవుడ్ ఖండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో.
2005లో విడుదలయిన సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమా 'నో ఎంట్రీ'కి ఇన్నాళ్లకు సీక్వెల్ తెరకెక్కనుంది. ఇక ఇందులో ఏకంగా 10 మంది హీరోయిన్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట సల్మాన్. అందులో రష్మిక మందనా, పూజా హెగ్డేలాంటి వారి పేర్లు కూడా వినిపిస్తుండగా.. వారిలో సమంత కూడా ఒకరని సమాచారం. ఎలాగో బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటాలనుకుంటున్న సమంతకు సల్మాన్ ఖాన్ సినిమా మంచి అవకాశమే అనుకుంటున్నారు ప్రేక్షకులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com