Samantha: దానికోసం చాలా డబ్బులిచ్చాను: సమంత

Samantha: దానికోసం చాలా డబ్బులిచ్చాను: సమంత
Samantha: అనుకున్నట్టుగానే సమ్ంత.. కాఫీ విత్ కరణ్‌లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Samantha: 'కాఫీ విత్ కరణ్' షోలో పాల్గొనే సెలబ్రిటీలు ప్రొఫెషనల్ లైఫ్‌కంటే పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా చర్చిస్తారు. ఆ షో హోస్ట్ కరణ్ జోహార్ కూడా సెలబ్రిటీల చుట్టూ తిరిగే కాంట్రవర్సీల గురించే ఎక్కువగా ప్రశ్నలను సంధిస్తాడు. అందుకే సమంత.. ఈ షోలో పాల్గొంటుంది అని తెలియగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. అనుకున్నట్టుగానే సమ్ంత.. కాఫీ విత్ కరణ్‌లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

నాగచైతన్యతో విడాకుల విషయంపై చాలానే ఓపెన్ అయ్యింది సమంత. ఇప్పటివరకు ఎక్కడా చెప్పని వివరాలు కాఫీ విత్ కరణ్‌లో చెప్పుకొచ్చింది. వారిద్దరూ ఒకే గదిలో ఉంటే చాలా డేంజర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా కరణ్.. పొరపాటున నాగచైతన్యను భర్త అంటే.. మాజీ భర్త అనమని స్పష్టంగా చెప్పేసింది. అంతే కాకుండా తన పాపులారిటీ గురించి కూడా సమంత ఇలాంటి వ్యాఖ్యలే చేసింది.

ఓర్మాక్స్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ పాపులర్ నటీమణులు లిస్ట్‌లో సమంత మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తన తర్వాత పలువురు బాలీవుడ్ హీరోయిన్లు ఈ లిస్ట్‌లో నిలవగలిగారు. అయితే ఇదే విషయాన్ని కరణ్ జోహార్.. సమంతను అడిగాడు. నెంబర్ వన్ స్థానాన్ని ఎలా దక్కించుకున్నావు అనే ప్రశ్నకు ఆ సంస్థకు చాలా డబ్బులిచ్చాను అని తెలిపింది. ఇది కామెడీగానే చెప్పినా కూడా ఒకవేళ ఇది నిజమేనా అని సందేహంలో పడిన ప్రేక్షకులు కూడా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story