Sara Ali Khan: బికినీ వేసిన సుందరాంగుడు... ఎవరో కాదూ మన సారానే...!

బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ఉన్నట్లుండి గుబురు గడ్డంతో దర్శనమిచ్చంది. తన సోషల్ మీడియా పేజ్ లో ఈ ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో పరేషాన్ అయిపోతున్న ఫ్యాన్స్ అమ్మడికి ఏమయిందంటూ తెగ కంగారు పడిపోతున్నారు. అయితే మరి కొందరు అమ్మడు ఏదైనా సినిమాలో ఈ గెటప్ లో కనిపించబోతోందా అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెడుతూ సారానే క్లారిటీ ఇచ్చేసింది. ఫొటోకు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ హోమీ అదాజానియాను టాగ్ చేస్తూ ఫొటోగ్రాఫర్ ను కనుక్కోండి అంటూ స్పందించిన సారా, తనలోని స్త్రీతత్వాన్ని అత్యద్భుతంగా వెలికితీస్తున్న వైనానికి కృతజ్ఞతలు తెలిపింది. అయితే కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే సారా కావాలనే ఈ ఫొటోకు పలు ఎఫెక్ట్ లు ఉపయోగించి గడ్డం, మీసాలు తగిలించిందని స్పష్టమవుతుంది. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గ్లామరస్ రోల్స్ రఫ్పాడించేస్తున్న సారా మరోవైపు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల కూడా చేసేందుకు మక్కువ చూపుతోంది. మరి హోమీ అయినా అమ్మడి ముచ్చట తీరుస్తాడేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com