Sara Ali Khan: పటౌడీ చిన్నది దెయ్యమంటే భయమన్నది....

X
By - Chitralekha |28 March 2023 1:23 PM IST
పురాతన ప్యాలెస్ లో షూటింగ్; అతీత శక్తులతో భయాందోళనకు లోనైన సారా అలీఖాన్
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ప్రస్తుతం భయంతో బిక్కచిక్కిపోతోందట. గ్యాస్ లైట్ సెట్స్ పై అమ్మడు జడుసుకుని గజగజా వణికిపోతోందని వినికిడి. ఈ విషయాన్ని గ్యాస్ లైట్ లో అమ్మడికి కో-స్టార్ గా నటిస్తోన్న చిత్రాంగదా సింగ్ వెల్లడించింది. విషయం ఏమిటంటో ప్రస్తుతం సారా గ్యాస్ లైట్ అనే సినిమాలో నటిస్తోంది. వాంకనేర్ ప్యాలెస్ లో షూటింగ్ జరుగుతుండటంతో దూరంగా ఉన్న హోటల్ లో సారా బస చేస్తోంది. అయితే హోటల్ షూటింగ్ స్పాట్ కు మరీ దూరంగా ఉండటంతో ఆమె కూడా ఇతర బృందంతో కలసి ప్యాలెస్ లోనే బస చేసింది. కానీ, ఆ సమయంల ో సారాకు అనుహ్యమైన పరిస్థితులు ఎదురయ్యాయట. బాత్రూమ్ కు వెళ్లినప్పుడు, రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో పక్కనే ఉన్నట్లు, మెరుపువేగంతో ఎవరో దూసుకుపోయినట్లు అనిపించిదట. దీంతో జడుసుకున్న సారా వెంటనే మకాంను హోటల్ మార్చేసిందట. ఈ వార్త బయటకు పొక్కకుండా చిత్ర బృందం ఎంతగా ప్రయత్నించినప్పుటికీ చిత్రాంగద ద్వారా అసలు విషయం బట్టబయలు అయింది. అయితే సదరు ప్యాలెస్ నిజంగానే హాంటెడ్ అని అంటోన్న వారూ లేకపోలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com