Sara Ali Khan: విజయ్ దేవరకొండతో డేట్ చేయాలనుంది: సారా అలీ ఖాన్

Sara Ali Khan: విజయ్ దేవరకొండతో డేట్ చేయాలనుంది: సారా అలీ ఖాన్
Sara Ali Khan: చాలామంది యంగ్ హీరోయిన్లు విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉందంటూ తమ మనసులోని మాటను బయటపెట్టారు.

Sara Ali Khan: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటివరకు హిందీలో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ తనకు బాలీవుడ్‌లో ఉన్న పాపులారిటీ చూస్తుంటే మాత్రం అలా అనిపించదు. ముఖ్యంగా చాలామంది యంగ్ హీరోయిన్లు విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని, లేదా తనతో డేటింగ్ చేయాలని ఉందంటూ తమ మనసులోని మాటను బయటపెట్టారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో యంగ్ బ్యూటీ యాడ్ అయ్యింది.

ఇటీవల విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ మూవీ లైగర్ నుండి ఓ న్యూడ్ పోస్టర్ విడుదలయ్యింది. ఆ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండే కాదు.. ఎంతోమంది హీరోయిన్స్ నుండి కూడా విపరీతమైన రెస్పాన్స్ లభించింది. ఇక అందులో సగం మంది హీరోయిన్లు బాలీవుడ్‌కు చెందినవారు కావడం విశేషం. దీంతో విజయ్ క్రేజ్ బాలీవుడ్‌లో ఎంత ఉందో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇటీవల మరో హీరోయిన్ కూడా తాను విజయ్ దేవరకొండతో డేటింగ్‌కు వెళ్లాలని ఉందని కోరికను బయటపెట్టింది.

తాజాగా 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ ప్రారంభమయ్యింది. ఇందులోని తరువాతి ఎపిసోడ్‌లో సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ కలిసి రానున్నారు. ఇటీవల ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలయ్యింది. ఇందులో కరణ్.. సారాను ఎవరితో డేటింగ్‌కు వెళ్లాలని ఉందని అడగగా.. ముందు తను చెప్పడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. జాన్వీ కూడా ఇదివరకే విజయ్ దేవరకొండ పేరు చెప్పిందని తెలియని సారా షాక్ అయ్యింది. దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్‌లో విజయ్‌పై ప్రేమ పెంచుకుంటున్న యంగ్ బ్యూటీల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నట్టుగా అనిపిస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story