28 Jan 2023 9:57 AM GMT

Home
 / 
సినిమా / బాలీవుడ్ / Saurav Ganguly Biopic:...

Saurav Ganguly Biopic: దాదా బయోపిక్ కు ముహూర్తం ఖరారు

సౌరవ్ పాత్రలో రణ్ బీర్ కపూర్...! దాదా కీలక వ్యాఖ్యలు...

Saurav Ganguly Biopic: దాదా బయోపిక్ కు ముహూర్తం ఖరారు
X

స్పోర్ట్స్ సెలబ్రిటీల జీవత గాధల్లో క్రికెటర్ల కథలంటే ప్రేక్షకులకు అమితాసక్తి అనడంలో సందేహమేలేదు. ఇప్పటివరకూ క్రికెటర్లపై తెరకెక్కిన బయోపిక్ ల్లో దాదాపూ అన్నీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అందుకే ఇప్పుడు మరో సెలబ్రిటీ క్రికెటర్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కోవలోనే బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కు రంగం సిద్ధమవుతోంది. లవ్ ఫిల్మ్స్ పతాకం పై ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. అంతేకాదు రణ్ బీర్ కపూర్ ఈ సినిమాలో గంగూలీ పాత్రలో కనిపించబోతున్నాడన్నది మరో టాక్. అయితే ఈ అంశంపై స్పందించిన సౌరవ్ మాత్రం ఇప్పుడే ఏమీ చెప్పలేమని, స్క్రిప్ట్ గురించిన చర్చలు పూర్తైన తరువాతే క్యాస్టింగ్ సంగతి ఆలోచిస్తామని స్పష్టం చేశాడు. సుమారు రెండేళ్ల పరిశోధన అనంతరం, గతేడాది రచయిత సౌరవ్ చెప్పిన వివరాలు నమోదు చేసుకుని స్క్రిప్ట్ మొదటి డ్రాప్ట్ ను సిద్ధం చేశాడు. గంగూలీ ఈ స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చకచకా సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. అయితే దాదా ఏమాత్రం హడావిడికి తావులేకుండా, స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంటేనే ముందుకు వెళ్లబోతున్నాడని తెలుస్తోంది.

Next Story