Jawan: ఊహించిన దానికంటే ఎక్కువే.. షారుఖ్, అట్లీ సినిమా టీజర్ అదుర్స్..

Jawan: ఊహించిన దానికంటే ఎక్కువే.. షారుఖ్, అట్లీ సినిమా టీజర్ అదుర్స్..
Jawan: అట్లీ.. తమిళంలో మనసుకు హత్తుకుపోయే కథలను, మెసేజ్ ఇచ్చే స్టోరీలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నాడు.

Jawan: బాలీవుడ్ స్టార్ హీరోలు సౌత్ దర్శకులతో పనిచేసి చాలాకాలమే అయ్యింది. ఒకప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా తెలుగు, తమిళ దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు కేవలం రీమేక్‌ల వరకే వారు పరిమితమవుతున్నారు. చాలాకాలం తర్వాత ఓ బాలీవుడ్ సీనియర్ హీరో.. ఓ తమిళ దర్శకుడితో చేతులు కలుపుతున్నాడు.

అట్లీ.. తమిళంలో మనసుకు హత్తుకుపోయే కథలను, మెసేజ్ ఇచ్చే స్టోరీలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నాడు. అట్లీ తమిళంలో తెరకెక్కించిన చిత్రాలు.. తెలుగులో కూడా విడుదలయ్యి మంచి ఆదరణను సంపాదించుకున్నాయి. అయితే షారుఖ్‌తో సినిమా చేయడం తన కల అంటూనే ఆ కలను నిజం చేసుకున్నాడు అట్లీ.

అట్లీ, షారుఖ్ ఖాన్ సినిమా ప్రకటించి చాలాకాలమే అయినా దీనికి సంబంధించిన అప్డేట్ ఇన్నాళ్లకు బయటికి వచ్చింది. ఈ మూవీకి 'జవాన్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. అంతే కాకుండా జవాన్ మూవీ నుండి ఓ చిన్న టీజర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉన్నా.. ఊహించిన దానికంటే ఈ టీజర్ మరింత హైప్ ఇచ్చేలా ఉందని షారుఖ్ అభిమానులు అనుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story