Shah Rukh Khan: ఆ హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్ చేయడానికి సిగ్గుపడ్డాను: షారుక్

Shah Rukh Khan: ఆ హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్ చేయడానికి సిగ్గుపడ్డాను: షారుక్
Shah Rukh Khan: దివానా చిత్రానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా షారుక్.. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఏర్పాటు చేశాడు.

Shah Rukh Khan: ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి బాలీవుడ్ బాద్‌షాగా ఎదిగాడు షారుక్ ఖాన్. 30 ఏళ్ల క్రితం షారుక్ డెబ్యూ చేసిన 'దివానా' సినిమా విడుదలయ్యింది. మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను హృదయాలను కొల్లగొట్టడంతో పాటు మేకర్స్ దృష్టిలో పడ్డాడు షారుక్. ఇక ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా ద్వారా ముచ్చటించిన షారుక్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

దివానా చిత్రానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా షారుక్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చేసి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ముందుగా తన అప్‌కమింగ్ సినిమాల గురించి అభిమానులతో పంచుకున్నాడు షారుక్. ప్రస్తుతం తాను పతాన్, జవాన్ చిత్రాల్లో నటిస్తు్న్నానని తెలిపాడు. అంతే కాకుండా పతాన్ చిత్రంలో తన పాత్రకు, తనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని అన్నాడు. దీంతో పాటు రొమాంటిక్ చిత్రాల్లో నటించకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు షారుక్.

తాను రొమాంటిక్ సినిమాలు చేసే వయసు దాటిపోయింది అనిపిస్తోందన్నాడు షారుక్. ఒక్కొక్కసారి రొమాంటిక్ సినిమాలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయని అన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం తాను ఓ చిత్రంలో నటిస్తున్నప్పుడు తనకంటే చిన్న వయసున్న హీరోయిన్‌తో రొమాన్స్ చేయడానికి చాలా సిగ్గుపడ్డానని తెలిపాడు షారుక్. కానీ తాను ఒక యాక్టర్ కాబట్టి.. తను కూడా హీరోయిన్ వయసే అని ఊహించుకొని అలాంటి సీన్స్ చేయాల్సి వస్తుందని తెలిపాడు షారుక్.


Tags

Read MoreRead Less
Next Story