Shah Rukh Khan : జైలుకు వచ్చి కొడుకును కలిసిన షారూఖ్‌..!

Shah Rukh Khan : జైలుకు వచ్చి కొడుకును కలిసిన షారూఖ్‌..!
Shah Rukh Khan : బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌... డ్రగ్స్‌ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కొడుకు అర్యన్‌ ఖాన్‌ను కలిశారు.

Shah Rukh Khan : బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌... డ్రగ్స్‌ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కొడుకు అర్యన్‌ ఖాన్‌ను కలిశారు. డ్రగ్స్‌ కేసులో అర్యన్‌ ఖాన్‌కు నిన్న కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో అతను జైలులోనే ఉన్నారు. ముంబైలోని అర్ధర్‌ రోడ్‌ జైలుకు మొదటిసారి వెళ్లిన షారూఖ్‌ ఖాన్‌.. ఆర్యన్‌ ఖాన్‌ తో దాదాపు 20 నిమిషాలపాటు ముచ్చటించారు. ఈనెల అక్టోబర్‌ రెండున క్రూజ్‌ లో రేవ్‌ పార్టీ జరుగుతుందన్న సమాచారంలో నారోటిక్స్‌ కంట్రోల్‌ బోర్డు-ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. అర్యన్‌ ఖాన్‌ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బెయిల్‌ కోసం అర్యన్‌ ఖాన్‌ రెండుసార్లు కోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. కాగా గతవారం ఆర్యన్ తన తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే.

Tags

Next Story