Kiara Advani: ఈ ఏడాది చివర్లో నటుడితో కియారా పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన హీరో..

Kiara Advani: బాలీవుడ్ బడా దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించే టాక్ షో 'కాఫీ విత్ కరణ్'. ఈ షోలో కరణ్‌తో ఉన్న సాన్నిహిత్యంతో సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ గురించి కాస్త ఎక్కువగానే షేర్ చేసుకుంటారు. అలాగే పలు సందర్భాల్లో సెలబ్రిటీలు చేసిన కామెంట్లు ఎన్నో కాంట్రవర్సీలకు కూడా దారితీశాయి. కానీ ఈవారం ఎపిసోడ్‌లో మాత్రం కియారా అద్వానీ పెళ్లి గురించి ఓ ఆసక్తికర విషయం బయటపడింది.
కాఫీ విత్ కరణ్ సీజన్ 7లోని 8వ ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా విచ్చేశారు కియారా అద్వానీ, షాహిద్ కపూర్. వీరిద్దరూ కలిసి చేసిన 'కబీర్ సింగ్' చిత్రం సూపర్ డూపర్ హిట్‌ను సాధించింది. అప్పటినుండి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. ఇక ఈ ఎపిసోడ్‌లో వీరిద్దరు కలిసి చేసిన అల్లరి అంతా ఇంతా కాదని ఇటీవల విడుదలయిన ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
ప్రస్తుతం కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రిలేషన్‌లో ఉన్నారన్న విషయం బాలీవుడ్ మొత్తానికి తెలుసు. కానీ వీరిద్దరూ ఆ విషయం గురించి పెద్దగా బహిరంగంగా మాట్లాడలేదు. తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రాను క్లోజ్ ఫ్రెండ్‌కంటే ఎక్కువ అంటూ చెప్పుకొచ్చింది కియారా. అదే సమయంలో షాహిద్ కపూర్.. 'ఈ ఏడాది చివర్లో ఓ పెద్ద అనౌన్స్‌మెంట్‌కు సిద్ధంగా ఉండండి. అది కచ్చితంగా సినిమా గురించి మాత్రం కాదు' అంటూ కియారా పెళ్లి గురించి హింట్ ఇచ్చాడు. దీనిని కియారా కూడా ఖండించకపోవడంతో సిద్ధార్థ్‌తో ఈ ఏడాదిలోని కియారా ఏడడుగులు నడవనుందని బీ టౌన్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com