Sharmila Tagore: ఇంటి అద్దె కోసం నటించాను....

Sharmila Tagore:  ఇంటి అద్దె కోసం నటించాను....
గుల్మోహర్ వెబ్ సిరీస్ లో నటించిన షర్మిలా ఠాగుర్

షర్మిలా టాగుర్... క్లాసికల్ మూవీ లవర్స్ కు పరిచయం అక్కరలేని పేరు. అందానికి హుందాతనాన్ని అద్ది చక్కని బోమ్మను గీస్తే అది షర్మిలా లానే ఉంటుంది చెబుతారు మన సీనియర్ సిటిజెన్లు. అయితే ఇప్పటికీ ఆమె రాజసం ఏ నాయికకూ ఒంటబట్టలేదన్నది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఈ లేడీ నవాబ్ ఈ మధ్య చాలా అరుదుగా మాత్రమే తెరపై కనువిందు చేస్తున్నారు. తాజాగా గుల్మోహన్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తోన్న షర్మిల...ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. ఈ కోవలోనే 70, 80 దశకాల్లో సినిమాల్లో నటించేందుకు మిమ్మల్ని ప్రేరేపించిన అంశమేంటని అడిగిన ప్రశ్నకు షర్మిల తనదైన శైలిలో స్పందించారు. కొన్ని సార్లు డబ్బుల కోసమే నటించాను అని సూటిగా సమాధానమిచ్చారు. ఇంటి అద్దె కట్టేందుకు కొన్నిసార్లు నటించినట్లు వెల్లడించారు. అయితే ఎన్నోసార్లు తాను సినిమాలో ఉంటే సక్సెస్ అవుతుంది అని నమ్మిన స్నేహితుల కోసం కూడా నటించినట్లు స్పష్టం చేశారు. ఎన్నో కారణాల కోసం ఏన్నో సినిమాల్లో నటించానని తెలిపారు. అయితే కెరీర్ సాంతం చూసుకుంటే స్క్రిప్ట్ నచ్చడం వల్లే సినిమాల్లో నటించానని, అది అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఇప్పుడు గుల్మోహర్ లో కుసుమ్ పాత్ర అవసరం కాబట్టి నటిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ చిట్టెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుల్మోహర్ లో లైఫ్ ఆఫ్ పై సురజ్ శర్మ, సిమ్రన్, మనోజ్ బాజ్పయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story