శిల్పాతో బంధం సరిగ్గా లేదంటూ.. బలవంతంగా కిస్ చేశాడు..!

శిల్పాతో బంధం సరిగ్గా లేదంటూ.. బలవంతంగా కిస్ చేశాడు..!
పోర్న్ చిత్రాల కేసులో బాలీవుడ్ బ్యూటీ శిల్పా‌‌శెట్టి భర్త రాజ్‌‌కుంద్రా తాజాగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

పోర్న్ చిత్రాల కేసులో బాలీవుడ్ బ్యూటీ శిల్పా‌‌శెట్టి భర్త రాజ్‌‌కుంద్రా తాజాగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపైన విచారణ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. రాజ్‌‌కుంద్రా పై తాజాగా బాలీవుడ్ నటి షెర్లిన్‌‌‌చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. రాజ్‌‌కుంద్రా కేసును విచారిస్తున్న పోలీసులు ఇదే కేసులో షెర్లిన్‌‌‌చోప్రాకు ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ సారి ఓ బిజినెస్ డీల్ కోసం తన ఇంటికి వచ్చిన రాజ్‌కుంద్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అమె పేర్కొంది. శిల్పాశెట్టితో బంధం సరిగ్గా లేదంటూ తనని బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడంటూ షెర్లిన్‌‌‌చోప్రా ఆరోపించింది.

2019లో ఓ ప్రపోజల్‌ గురించి రాజ్‌‌‌కుంద్రా తన బిజినెస్‌ మెనేజర్‌కు కాల్‌ చేశాడని ఆమె తెలిపింది. ఇక 2019 మార్చి 27న బిజినెస్‌ మీటింగ్‌ అయిపోయిన తరువాత ఓ రోజు రాజ్‌‌‌కుంద్రా తనకు చెప్పకుండానే సరాసరీ ఇంటికే వచ్చి తన మాట వినకుండా బలవంతంగా ముద్దుపెట్టుకోబోయాడని ఆరోపించింది. అంతేకాకుండా తన భార్య శిల్పాశెట్టితో సంబంధం బాలేదని, ఎంతో ఒత్తిడి గురవుతున్నానని రాజ్‌‌కుంద్రా తనతో అనట్టుగా పేర్కొంది. ఆ సమయంలో తనకి భయం వేయడంతో, అతనిని తోసేసి వాష్ రూమ్‌కు పారిపోయానని తెలిపింది. ఒక పెళ్లైన వ్యక్తితో తను రిలేషన్‌షిప్‌ పెట్టుకోవాలని లేదని, తన ఆనందాలను బిజినెస్‌తో ముడిపెట్టాలని అనుకోలేదని ఆమె పేర్కొంది.

లైంగిక వేధింపుల కేసులో షెర్లిన్‌‌చోప్రా ఏప్రిల్ 2021 లో రాజ్‌‌కుంద్రాపై ఎఫ్ఐఆర్ జారీ చేసింది. అంతేకాకుండా కుంద్రా అరెస్ట్ తరువాత అశ్లీల చిత్రాల కేసుపై షెర్లిన్ చోప్రా తన వీడియో స్టేట్మెంట్ విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story