Shilpa Shetty: 'డైరెక్టర్ చెప్పారు.. అందుకే కాలు విరగ్గొట్టుకున్నా!'..

Shilpa Shetty: డైరెక్టర్ చెప్పారు.. అందుకే కాలు విరగ్గొట్టుకున్నా!..
Shilpa Shetty: ఒకప్పుడు బాలీవుడ్‌లో బ్యూటీ క్వీన్‌గా పేరు తెచ్చుకొని వరుసగా సినిమాలు చేసింది శిల్పా శెట్టి.

Shilpa Shetty: సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి నటీనటులకు గాయాలు అవుతూ ఉంటాయి. అలాగే తాజాగా బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి కాలికి కూడా గాయమయ్యింది. దీంతో తనను హాస్పిటల్‌కు తరలించారు. కానీ తన గాయానికి కారణం తన డైరెక్టరే అని, డైరెక్టర్ చెప్తేనే అలా చేశానని చెప్పి అందరికీ షాకిచ్చింది ఈ బ్యూటీ.

ఒకప్పుడు బాలీవుడ్‌లో బ్యూటీ క్వీన్‌గా పేరు తెచ్చుకొని వరుసగా సినిమాలు చేసింది శిల్పా శెట్టి. కానీ కొంతకాలం తర్వాత వెండితెరపై కనుమరుగయిపోయింది. అదే సమయంలో బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరించి తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. చాలాకాలం తర్వాత మళ్లీ శిల్పా శెట్టి.. తనలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. త్వరలోనే శిల్పా శెట్టి వెబ్ వరల్డ్‌లో కూడా అడుగుపెట్టనుంది.

'ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది ఈ భామ. అయితే తాజాగా ఈ సిరీస్ షూటింగ్ సమయంలో తన కాలికి గాయమయ్యింది. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శిల్పా శెట్టి. ''ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ సిరీస్‌ దర్శకులు.. రోల్‌, కెమెరా, యాక్షన్‌.. బ్రేక్‌ ఏ లెగ్‌! అని అన్నారు. నేను దాన్ని నిజం చేశా'' అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టింది. మామూలుగా బ్రేక్ ఏ లెగ్ అంటే అద్భుతంగా నటించమని అర్థం. కానీ దానికి తన స్టైల్ వెటకారాన్ని యాడ్ చేసి నిజంగానే కాలు విరగ్గొట్టుకున్నాను అన్నట్టుగా చెప్పుకొచ్చింది శిల్పా శెట్టి.


Tags

Read MoreRead Less
Next Story