Sid Kiara: ముచ్చటగా మూడు... కరణ్ ప్రొడక్షన్స్ లో...

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల పెళ్లి హడావిడి ఇంకా పూర్తిగా సద్దుమణగక ముందే అప్పుడే వారి ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు వెంటపడుతున్నారు. అయితే ఈ వరుసలో ముందుగా ఈ కొత్త జంట మీద ఖర్చీఫ్ వేసేశాడు కరణ్ జోహార్. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా మూడు సినిమాలకు ఒకేసారి బుక్ చేసేసుకున్నాడట. వరుణ్ ధవన్, ఆలియా భట్ దుల్హనియా సిరీస్ మాదిరే వీరితోనూ ఓ సిరీస్ తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడట కరణ్. త్వరలోనే కొత్త జంట మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ లో పాలపంచుకోబోతోందని వినికిడి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఇరువురూ తమ ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్నారు. చిన్న బ్రేక్ తరువాత ఆ షూటింగుల్లో పాలుపంచుకోనున్నారు. ఇక సిడ్ కియారా టిన్సెల్ టౌన్ లో తాజా పవర్ కపుల్ అన్న స్టేటస్ అందుకోవడంతో వీరి డేట్లను కైవసం చేసుకునేందుకు ఓ వైపు యాడ్ ఏజెన్సీలు, మరోవైపు నిర్మాణ సంస్థలు కూడా పోటీపడుతున్నాయని వినికిడి. ఏమైనా షేర్ షా తరువాత ఈ చూడముచ్చటైన జంటను చూసేందుకు అభిమానులు సైతం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com