అభిమానులకి టాప్ సింగర్ గుడ్ న్యూస్.. !

అభిమానులకి టాప్ సింగర్ గుడ్ న్యూస్.. !
త్వరలోనే తాను తల్లిని కాబోతున్నట్టుగా అభిమానులకు వెల్లడించింది. బేబీ శ్రేయాదిత్య కమింగ్‌ అంటూ ట్వీట్ చేసింది శ్రేయా..

బాలీవుడ్ టాప్ సింగర్ శ్రేయా ఘోషాల్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను తల్లిని కాబోతున్నట్టుగా అభిమానులకు వెల్లడించింది. బేబీ శ్రేయాదిత్య కమింగ్‌ అంటూ ట్వీట్ చేసింది శ్రేయ.. తమ జీవితంలో ఈ సరికొత్త అధ్యాయాన్ని పంచుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని ఆమె వెల్లడించారు. ఈ శుభ సందర్భంలో అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలని కోరింది. దీనితో ఆమెకి నెటిజన్లు అభినందనలు, ఆశీస్సులు అందజేస్తున్నారు. కాగా శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను 2015, ఫిబ్రవరి 5న వివాహం చేసుకున్నారు. శ్రేయా ఘోషాల్ హిందీలోనే కాకుండా... తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీతో పాటుగా పలుభాషల్లో పాటలు పాడి చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story