Sohail Khan: ఆ హీరోయిన్ వల్లే సల్మాన్ ఖాన్ తమ్ముడికి విడాకులు..

Sohail Khan: ఈమధ్య సినీ పరిశ్రమలో విడాకులు అనేవి ఫ్యాషన్‌గా మారిపోయాయి. ఎన్నో ఏళ్లుగా కలిసుంటున్న జంటలు కూడా విడాకుల బాటపడుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌లో మరో జంట 24 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడానికి సిద్ధపడింది. సల్మాన్ ఖాన్ చిన్న తమ్ముడు సొహైల్ ఖాన్.. తన భార్య సీమా ఖాన్‌కు విడాకులు ఇస్తున్నట్టుగా వార్తలు వైరల్‌గా మారాయి. అయితే వీరి విడాకులకు ఓ హీరోయినే కారణమంటూ మరో వార్త వెలుగులోకి వచ్చింది.
సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకే పెళ్లి పడదేమో అనుకుంటున్నారు అభిమానులు. ముందుగా తన పెద్ద తమ్ముడు అర్భాజ్ ఖాన్.. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వారు కూడా కొంతకాలానికి విడాకులు తీసుకున్నారు. ఇక 24 ఏళ్లు పెళ్లి బంధంలో ఉన్న సొహైల్ ఖాన్ కూడా విడాకులకు సిద్ధమవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి అతడి ఎఫైరే కారణమని టాక్ వినిపిస్తోంది.
బాలీవుడ్‌లో ఎంతోకాలంగా నటిగా తన హవా కొనసాగిస్తుంది హుమా ఖురేషి. అయితే సొహైల్ ఖాన్.. హుమా ఖురేషి గతకొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారని.. దానివల్లే తనకు, సీమా ఖాన్‌కు విడాకులు అవుతున్నాయని బాలీవుడ్ అంతా గుసగుసలాడుతోంది. కానీ దీని గురించి మాత్రం వీరిలో ఎవ్వరూ స్పందించడానికి సిద్ధంగా లేరు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com